ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Saudi Arabia: హజ్‌ వీసా ఉంటేనే మక్కాలోకి అనుమతి

ABN, Publish Date - Apr 27 , 2025 | 01:53 AM

ఈ ఏడాది హజ్‌ యాత్ర ప్రారంభం సందర్భంగా, సౌదీ అరేబియా విదేశీ పౌరుల కోసం మక్కా నగరంలో ప్రవేశం కోసం కొత్త నిబంధనలను అమలు చేసింది. ఈ నెల 23 నుంచి హజ్‌ పర్మిట్‌ లేకుండా ఎలాంటి విదేశీయుడినీ మక్కా నగరంలోకి అనుమతించబోమని సౌదీ అధికారులు ప్రకటించారు.

రియాద్‌, ఏప్రిల్‌ 26: ఈ ఏడాది హజ్‌ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో మక్కా నగరంలోకి విదేశీయుల ప్రవేశంపై సౌదీ అరేబియా ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఈనెల 23 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల మేరకు హజ్‌ పర్మిట్‌ లేకుండా ఏ ఒక్క విదేశీయుడినీ మక్కా నగరంలోకి అనుమతించబోమని సౌదీ అధికారులు తెలిపారు. ఈ నిబంధనలను అతిక్రమించి వచ్చే విదేశీయులు భారీ జరిమానా, జైలుశిక్ష, దేశ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈనెల 29 నుంచి నిబంధనలు మరింత కట్టుదిట్టం కానున్నాయని, హజ్‌ వీసా ఉన్నవారిని మాత్రమే మక్కా నగరంలోకి అనుమతిస్తామని తెలిపారు. హజ్‌యాత్రలో అనధికారిక రద్దీని నివారించేందుకు భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సహా 14 దేశాల పౌరులకు వీసా నిబంధనల్లో మార్పులు చేస్తున్నామని ఈ ఏడాది ప్రారంభంలోనే సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ఆయా దేశాల పౌరులకు ఇకపై సింగిల్‌ ఎంట్రీ వీసాలను మాత్రమే మంజూరు చేస్తామని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి:

పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..

Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్

Updated Date - Apr 27 , 2025 | 01:53 AM