Russia- Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడి..
ABN, Publish Date - May 11 , 2025 | 04:41 PM
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ దశగా ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని రష్యా అధక్ష్యుడు వ్లాదిమిర్ పుతీన్ కూడా ప్రకటించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏళ్లుగా సాగుతూనే ఉంది (Russia- Ukraine War). ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ దశగా ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని రష్యా అధక్ష్యుడు వ్లాదిమిర్ పుతీన్ కూడా ప్రకటించారు. ఆ ప్రకటన పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా హర్షం వ్యక్తం చేశారు.
చర్చలకు సిద్ధమని పుతీన్ ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం డ్రోన్ దాడికి పాల్పడింది. ఉక్రెయిన్ రాజధాని కివీ, ఇతర ప్రాంతాలపై రష్యా డ్రోన్ దాడులకు దిగింది. సామాన్యుల ఇళ్లకు నష్టం వాటిల్లినట్టు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. తెల్లవారుఝామున రెండు గంటల సమయంలో 108 డ్రోన్లతో రష్యా దాడికి దిగిందని తెలిపారు. వాటిల్లో 60 డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసిందని తెలిపారు. ఈ దాడిలో ఒక వ్యక్తి గాయపడినట్టు తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 11 , 2025 | 04:41 PM