Royal Navy Appoints First Hindu Priest: రాయల్ నేవీలో తొలిసారిగా హిందూ పూజారి
ABN, Publish Date - Aug 20 , 2025 | 04:18 AM
బ్రిటన్‌లోని రాయల్ నేవీలో తొలిసారిగా హిందూ పూజారి నియమితులయ్యారు. నేవీ అఽధికారులకు హిందూ ..
హిమాచల్ ప్రదేశ్‌వాసికి అవకాశం
లండన్, ఆగస్టు 19: బ్రిటన్‌లోని రాయల్ నేవీలో తొలిసారిగా హిందూ పూజారి నియమితులయ్యారు. నేవీ అఽధికారులకు హిందూ ఆధ్యాత్మిక విషయాలను బోధించడానికి బ్రిటన్‌లో నివసిస్తున్న హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన భాను అత్రీకి ఈ అవకాశం లభించింది. రాయల్ నేవీలోని తొలి క్రైస్తవేతర పూజారి ఈయనే కావడం విశేషం. ఈ పదవిలో నియమించే ముందు ఆయనకు కఠినమైన మిలటరీ శిక్షణ ఇచ్చారు. యుద్ధనౌక హెచ్‌ఎంఎ్‌స ఐరన్ డ్యూక్‌లో మూడు వారాల పాటు సముద్రంలో శిక్షణ పొందారు.
Updated Date - Aug 20 , 2025 | 04:18 AM