Giorgio Armani: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆర్మనీ కన్నుమూత
ABN, Publish Date - Sep 05 , 2025 | 04:59 AM
ఇటలీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జియోర్గియో ఆర్మనీ కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏళ్లు...
మిలన్, సెప్టెంబరు 4: ఇటలీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జియోర్గియో ఆర్మనీ కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏళ్లు. తాను నెలకొల్పిన జియోర్గియో ఆర్మనీ ఫ్యాషన్ హౌస్ 50 ఏళ్ల ఉత్సవాన్ని ఈ నెలలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. సాధారణ ఇటాలియన్ ఫ్యాంటు, షర్టు వంటి రెడీమేడ్ దుస్తులతో వ్యాపారాన్ని ప్రారంభించి దాన్ని 10 బిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా విస్తరించారు. సౌందర్య దృష్టిని వ్యాపారంగా మార్చడంలో విజయం సాధించిన పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. 1934 జూలై 11న పియాసెంజా అనే చిన్న పట్టణంలో జన్మించిన ఆయన తొలుత ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో విండో డెకరేటర్‌గా పనిచేశారు. అనంతరం ఫ్యాషన్ రంగంపై దృష్టి సారించి విజయం సాధించారు.
Updated Date - Sep 05 , 2025 | 04:59 AM