ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Relay 2: అంతరిక్షంలో అంతుచిక్కని కాంతి.. సైంటిస్టులు షాక్..

ABN, Publish Date - Jun 22 , 2025 | 09:25 PM

Relay 2 Satellite: ఆ సిగ్నల్ భూమికి 20వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు. దాన్ని అంతరిక్షంలో ఉన్న అన్ని శాటిలైట్ల లోకేషన్స్‌తో సరిపోల్చి చూడగా.. ఆ సిగ్నల్ రిలే 2 శాటిలైట్ నుంచి వచ్చినట్లు కనుగొన్నారు.

Relay 2 Satellite

అంతరిక్షంలోని ఓ శాటిలైట్ సైంటిస్టులను షాక్ చేస్తోంది. ఎప్పుడో డెడ్(పని చేయకుండాపోయిన)అయిన ఆ శాటిలైట్ నుంచి అంతుచిక్కని రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి. ఒక్కో సిగ్నల్ ఎంత శక్తివంతంగా ఉందంటే.. ఆ సిగ్నల్ కారణంగా ఆకాశంలోని మిగిలిన వస్తువులు మెరుస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నాసా రిలే ప్రోగ్రామ్‌లో భాగంగా 1964లో రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. భూమి కక్ష్యలోని కమ్యూనికేషన్‌ను పరీక్షించడానికి నాసా వాటిని పంపింది.

అయితే, 1965 వాటిని వాడటం ఆపేసింది. ఆ రెండు కూడా 1967 నుంచి పని చేయటం మానేశాయి. గత సంవత్సరం ఆస్ట్రేలియన్ స్క్వయర్ కిలోమీటర్ ఆరే పాత్ ఫైండర్‌ను వాడుతున్న సైంటిస్టులు.. 30 నానో సెకన్ల వ్యవధి కలిగిన శక్తివంతమైన వెలుతురును గుర్తించారు. ఆ శక్తి వంతమైన వెలుతురు మన గెలాక్సీ నుంచి వచ్చిందని తెలిసి షాక్ అయ్యారు. దీనిపై క్లాన్సీ అనే సైంటిస్టు మాట్లాడుతూ.. ‘అది గనుక మనకు దగ్గరగా ఉంటే.. ఆప్టికల్ టెలిస్కోప్ ద్వారా దాన్ని సులభంగా స్టడీ చేయొచ్చు.

మేము చాలా ఆత్రుతగా ఉన్నాం. ఏదైనా కొత్త వస్తువు లేదా కొత్త జీవిని కనిపెట్టవచ్చనే ఆలోచనలో ఉన్నాం. అది చాలా శక్తివంతమైన రేడియో సిగ్నల్. దాని కారణంగా ఆకాశంలో ఉన్నవన్నీ స్పష్టంగా కనిపించాయి’ అని అన్నారు. ఆ సిగ్నల్ భూమికి 20వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు. దాన్ని అంతరిక్షంలో ఉన్న అన్ని శాటిలైట్ల లోకేషన్స్‌తో సరిపోల్చి చూడగా.. ఆ సిగ్నల్ రిలే 2 శాటిలైట్ నుంచి వచ్చినట్లు కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి

యూఎస్ దాడులు.. ఇరాన్ కీలక నిర్ణయం..

అరుదైన దృశ్యం.. పొలంలో రాబందుల గుంపు

Updated Date - Jun 22 , 2025 | 09:35 PM