ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US Plane Crash: సముద్రంలో కూలిన ప్రైవేటు విమానం

ABN, Publish Date - Jun 09 , 2025 | 10:06 PM

అమెరికాలో తాజాగా ఓ తేలికపాటి విమానం సముద్రంలో కూలింది. ఘటన సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. యూఎస్ కోస్టు గార్డు గాలింపు చర్యలు ప్రారంభించింది.

US Plane Crash

అమెరికాలో ఓ తేలికపాటి విమానం సముద్రంలో కూలింది. సెస్నా 414 విమానం పసిఫిక్ మహాసముద్రంలో శాన్‌డియాగో తీరానికి సమీపంలో సోమవారం కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వారి కోసం అమెరికా కోస్ట్ గార్డు, ఇతర రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు ప్రారంభిచాయి. విమానం కూలిన ప్రాంతంలో నీటి లోతు సుమారు 200 అడుగులు ఉంటుందని కోస్ట్ గార్డు అధికారులు తెలిపారు. ఇక విమానం కూలడానికి గల కారణం తెలుసుకునేందుకు అమెరికా పౌరవిమానయాన నియంత్రణ సంస్థ, అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

శ్వేతసౌధంలో ట్రెజరీ సెక్రెటరీతో మస్క్ బాహాబాహీ.. విషయం తెలిసి ట్రంప్ షాక్

మస్క్‌పై కోర్టులో కేసు వేయనున్న ట్రంప్?

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 08:35 AM