ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Antonio Guterres: పాలస్తీనాకు దేశహోదా.. కానుక కాదు, హక్కు

ABN, Publish Date - Sep 24 , 2025 | 02:52 AM

పాలస్తీనాకు దేశహోదా అనేది హక్కు. కానుక కాదు!. ప్రస్తుత పీడకలకు ఇదొక్కటే పరిష్కారం. గాజా యుద్ధానికి కూడా ఇదొక్కటే ముగింపు....

ఇదొక్కటే గాజా యుద్ధానికి ముగింపు.. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో

  • పాలస్తీనాకు మద్దతు పలికిన మొనాకో

  • 145కు చేరిన మద్దతు దేశాల సంఖ్య

యునైటెడ్‌ నేషన్స్‌, సెప్టెంబరు 23: ‘‘పాలస్తీనాకు దేశహోదా అనేది హక్కు. కానుక కాదు!. ప్రస్తుత పీడకలకు ఇదొక్కటే పరిష్కారం. గాజా యుద్ధానికి కూడా ఇదొక్కటే ముగింపు.’’ అని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ స్పష్టం చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో మంగళవారం ప్రారంభమైన ఐరాస 80వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గాజాలో పరిస్థితి అత్యంత భీకరంగా, భయంకరంగా ఉందని తెలిపారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనాల మధ్య వివాదానికి పాలస్తీనాకు దేశ హోదా కల్పించడమే పరిష్కారమని పేర్కొన్నారు. అయితే, హమాస్‌ మారణహోమాన్ని, పాలస్తీనా ప్రజల సామూహిక హననాలను ఎవరూ ఎట్టిపరిస్థితిలోనూ సమర్థించబోరని గుటెర్రెస్‌ నొక్కి చెప్పారు. మరోవైపు.. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంకులో విస్తరించడాన్ని, నిర్మాణాలు చేపట్టడాన్ని ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షురాలు అన్నాలేనా బేర్‌బాక్‌ ఖండించారు. వెస్ట్‌బ్యాంకులో విస్తరణలు, కూల్చివేతలు వంటివి రాజకీయ పరిష్కారాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని తెలిపారు. ఇక, ఇజ్రాయెల్‌ ఆర్థిక శాఖ మంత్రి బెజలెల్‌ స్మోట్రిచ్‌ ఇటీవల మాట్లాడుతూ.. పాలస్తీనా దేశం అనే మాటేలేదని, ఇప్పటి వరకు నినాదాలకే దీనిని పరిమితం చేశామని, ఇక నుంచి చర్యలకు దిగుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే, పాలస్తీనాకు దేశహోదా కల్పించాలని కోరుతున్న దేశాల్లో మొనాకో కూడా చేరింది. దీంతో పాలస్తీనాకు మద్దతిస్తున్న దేశాల సంఖ్య 145కు చేరింది. దీనిపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జోర్డాన్‌ నది పశ్చిమాన ఏ దేశ ఏర్పాటును, గుర్తింపును తాము ఒప్పుకొనేది లేదని స్పష్టం చేశారు.

Updated Date - Sep 24 , 2025 | 02:52 AM