India Pakistan talks: సౌదీ తటస్థ వేదికగా చర్చలు
ABN, Publish Date - May 23 , 2025 | 05:13 AM
సౌదీ అరేబియా భారత్, పాక్ మధ్య చర్చలకు తటస్థ వేదికగా ముందుకొచ్చింది అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. భారత్ మాత్రం చైనా భాగస్వామ్యం చర్చలకు అనుమతించదని స్పష్టం చేసింది.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆశాభావం
ఇస్లామాబాద్, మే 22: కశ్మీర్, సింధూ జలాలు, వాణిజ్యం, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై సౌదీ అరేబియా తటస్థ వేదికగా భారత్, పాక్ మధ్య చర్చలు జరగొచ్చని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సౌదీ ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన తటస్థ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కరాచీకి చెందిన డాన్ పత్రిక కథనం ప్రచురించింది. అయితే చైనాలో చర్చలు జరిగే అవకాశాన్ని ఆయన తోసిపుచ్చారు. దీనికి భారత్ ఎప్పటికీ అంగీకరించబోదని చెప్పారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సౌదీ ప్రకటించింది. కాగా, ఉగ్రవాదం, పీవోకేను అప్పగించడంపై మాత్రమే పాక్‌తో చర్చలు జరుపుతామని, ఇందులో మూడో పక్షం జోక్యానికి తావులేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News
Updated Date - May 23 , 2025 | 05:13 AM