Pakistan US Relations: ట్రంప్‌కు పెట్టె చూపి.. బుట్టలోకి..!
ABN, Publish Date - Sep 29 , 2025 | 03:18 AM
అమెరికా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వాషింగ్టన్‌తో ఇస్లామాబాద్ సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా పాకిస్థాన్ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.....
అమెరికా పెట్టుబడులకు పాక్ వ్యూహం
గిఫ్ట్‌గా అరుదైన ఖనిజాల పెట్టె
వాషింగ్టన్, సెప్టెంబరు 28: అమెరికా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వాషింగ్టన్‌తో ఇస్లామాబాద్ సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా పాకిస్థాన్ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను శ్వేతసౌధంలో కలిసిన పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్.. అరుదైన ఖనిజాలతో కూడిన ఓ చెక్క పెట్టెను ఆయనకు బహూకరించారు. ఆ పెట్టెలోని ఖనిజాలను చూపుతూ ఆసిం మునీర్ వివరిస్తుండగా.. ట్రంప్ ఆసక్తిగా తిలకించారు. దీనికి సంబంధించిన ఫొటోను తాజాగా విడుదల చేసిన శ్వేత సౌధం.. ఇది రెండు దేశాల మధ్య సానుకూల పరిణామంగా అభివర్ణించింది. అయితే కొద్దిరోజుల ముందే పాక్‌లో అరుదైన ఖనిజాల వెలికితీతకు అమెరికాకు చెందిన ఓ కంపెనీ 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టెందుకు ఎంఓయూ కుదుర్చుకుంది.
Updated Date - Sep 29 , 2025 | 03:18 AM