ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shehbaz Sharif: 4 రోజుల్లో భారత్‌ అహాన్ని అణిచివేశాం

ABN, Publish Date - Aug 15 , 2025 | 04:31 AM

పహల్గాం ఉగ్రదాడికి బదులుగా పాక్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మే 7న భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అంశంలో ..

ఇస్లామాబాద్‌, ఆగస్టు 14: పహల్గాం ఉగ్రదాడికి బదులుగా పాక్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మే 7న భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అంశంలో పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ అహంకారాన్ని నాలుగు రోజుల్లోనే అణిచివేశామని ప్రకటించారు. మే నెలలో భారత్‌-పాక్‌ మధ్య జరిగిన సైనిక చర్య తమకు లభించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణకు కృషి చేశారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. పాకిస్థాన్‌ 79వ స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 14) నేపథ్యంలో బుధవారం రాత్రి ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షెహబాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన భారత్‌ను ఎదుర్కొనే విషయంలో తమ అణు సామర్థ్యం వ్యూహాత్మకంగా కీలక పాత్ర పోషించిందని తెలిపారు.

Updated Date - Aug 15 , 2025 | 04:31 AM