Oman: ఆదాయపు పన్ను విధించే యోచనలో ఒమన్
ABN, Publish Date - Jun 24 , 2025 | 03:56 AM
గల్ఫ్ దేశం ఒమన్ 2028 నుంచి ఆదాయపు పన్ను(ఐటీ) విధించాలని యోచిస్తోంది. ఏడాదికి 42 వేల రియాల్స్ (సుమారు రూ.95 లక్షలు) కంటే ఎక్కువ సంపాదించే వారిపై 5శాతం ఆదాయపు పన్ను విధించాలని చూస్తోంది.
అమలు చేస్తే తొలి గల్ఫ్ దేశంగా రికార్డు
మస్కట్, జూన్ 23: గల్ఫ్ దేశం ఒమన్ 2028 నుంచి ఆదాయపు పన్ను(ఐటీ) విధించాలని యోచిస్తోంది. ఏడాదికి 42 వేల రియాల్స్ (సుమారు రూ.95 లక్షలు) కంటే ఎక్కువ సంపాదించే వారిపై 5శాతం ఆదాయపు పన్ను విధించాలని చూస్తోంది. ఈ ఆదాయ జాబితాలో సుమారు ఒక శాతం మంది ఉంటారని అంచనా. చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు ఒమన్ ఆర్ధిక మంత్రి సయ్యద్ బిన్ మొహ్మద్ అల్ సక్రీ చెప్పారు. ఈ ఆర్ధిక సంస్కరణలతో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌లోని మిగతా దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యూఏఈ, ఖతర్ దేశాలకు ఒమన్ ఆదర్శంగా నిలిచే అవకాశముందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. త్వరలో సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలు ద్రవ్యలోటు ఎదుర్కొనే అవకాశాలున్నాయని, ఈ తరుణంలో ఆర్ధిక సంస్కరణలు ఉత్తమమని ఐఎంఎఫ్ సూచిస్తోంది. ఈ దేశాలకు ముడిచమురే ప్రధాన ఆదాయవనరైనా అంతర్జాతీయంగా శిలాజ ఇంధనాలకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో ఆర్ధిక సంస్కరణలు తప్పనిసరి అని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
Updated Date - Jun 24 , 2025 | 03:57 AM