ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gun License Expired: న్యూయార్క్‌లో దుండగుడి కాల్పులు

ABN, Publish Date - Jul 30 , 2025 | 06:13 AM

ఎప్పుడూ రద్దీగా ఉండే అమెరికా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లో కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు కాల్పులకు

  • నలుగురి మృతి.. తర్వాత నిందితుడి ఆత్మహత్య

న్యూయార్క్‌, జూలై 27: ఎప్పుడూ రద్దీగా ఉండే అమెరికా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లో కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు కాల్పులకు పాల్పడంతో ఓ పోలీసు అధికారి సహా నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అనంతరం దుండగుడు తనని తాను కాల్చుకొని మరణించాడు. సోమవారం ఈ ఘటన జరిగింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ ధరించి ఏఆర్‌ రైఫిల్‌తో దుండగుడు వచ్చాడని, 345 పార్క్‌ అవెన్యూ భవనంలోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు చెప్పారు. కాల్పుల శబ్దం విని ప్రజలు భవనం నుంచి పరుగులు తీశారని, ఆ తర్వాత దుండగుడు తనని తాను కాల్చుకొని మరణించాడని అధికారులు వెల్లడించారు. దుండగుడి వద్ద ఉన్న రైఫిల్‌కు లైసెన్స్‌ ఉందని, అయితే దాని గడువు ముగిసిందని గుర్తించారు. కాగా, కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు.

Updated Date - Jul 30 , 2025 | 06:13 AM