ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Canada: కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ..9 ఏళ్ల ట్రూడో పాలన అంతం

ABN, Publish Date - Mar 10 , 2025 | 07:13 AM

కెనడాలో జరిగిన తాజా ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో జస్టిన్ ట్రూడో పాలనకు ప్రజలు గుడ్ బాయ్ చెప్పేశారు. దీంతో కెనడాకు కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ఎంపికయ్యారు.

Mark Carney

కెనడా(Canada) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్క్ కార్నీ(Mark Carney) లిబరల్ పార్టీ నాయకుడిగా ఎన్నికై, కెనడా 24వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో, జస్టిన్ ట్రూడో 9 ఏళ్ల పాలనకు ముగింపు పలికారు. మార్క్ కార్నీ లిబరల్ పార్టీ నాయకత్వ పోటీలో 131,674 ఓట్లతో గెలిచారు. ఇది మొత్తం పోలైన 85.9% బ్యాలెట్లకు సమానం. ఈ పోటీలో ఆయన ప్రత్యర్థులు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

  • క్రిస్టియా ఫ్రీలాండ్ – 11,134 ఓట్లు

  • కరీనా గౌల్డ్ – 4,785 ఓట్లు

  • ఫ్రాంక్ బేలిస్ – 4,038 ఓట్లు

ఈ భారీ విజయంతో కార్నీ లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతలను త్వరలో చేపట్టనున్నారు. ఆయనకు ఆర్థిక రంగంలో అపారమైన అనుభవం ఉండటంతోపాటు కెనడా ప్రజలు ఆయన పాలనపై చాలా ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు.


వ్యక్తిగత జీవితం

మార్క్ జోసెఫ్ కార్నీ 1965 మార్చి 16న నార్త్‌వెస్ట్ టెరిటోరీస్‌లోని ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు. అల్బెర్టాలోని ఎడ్మంటన్‌లో పెరిగిన కార్నీ, హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని 1988లో పొందారు. తరువాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో 1993లో మాస్టర్స్, 1995లో డాక్టరేట్ డిగ్రీలను సాధించారు.

వృత్తి ప్రస్థానం

  • కార్నీ తన వృత్తి జీవితాన్ని గోల్డ్‌మన్ సాచ్స్‌లో ప్రారంభించి, వివిధ కీలక పదవుల్లో పనిచేశారు

  • 2004లో, కార్నీ కెనడా ఫైనాన్స్ డిపార్ట్‌మెంటులో సీనియర్ అసోసియేట్ డిప్యూటీ మినిస్టర్‌గా వర్క్ చేశారు

  • 2008 నుంచి 2013 వరకు, కార్నీ కెనడా బ్యాంక్ 8వ గవర్నర్‌గా సేవలందించారు. ఆ సమయంలో 2008 ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు

  • 2013 నుంచి 2020 వరకు, కార్నీ ఇంగ్లాండ్ బ్యాంక్ 120వ గవర్నర్‌గా కూడా పనిచేశారు. బ్రెగ్జిట్, కోవిడ్-19 మహమ్మారి సమయంలో బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను నడిపించారు

  • కార్నీ 2011 నుంచి 2018 వరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ ఛైర్మన్‌గా, అలాగే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ యాక్షన్ ఫైనాన్స్ స్పెషల్ ఎన్‌వాయ్‌గా సేవలందించారు.


రాజకీయ ప్రస్థానం

కార్నీ 2024లో లిబరల్ పార్టీకి ఆర్థిక సలహాదారుగా చేరారు. 2025 జనవరిలో ఆయన లిబరల్ పార్టీ నాయకత్వ పోటీలో పాల్గొని, మార్చి 9న 86% ఓట్లతో విజయం సాధించారు.

వ్యక్తిగత జీవితం

కార్నీ భార్య డయానా ఫాక్స్ కాగా, వీరికి నాలుగురు కుమార్తెలు ఉన్నారు. కార్నీ క్రీడల్లో ఆసక్తి చూపిస్తూ హాకీ, రగ్బీ వంటి ఆటల్లో పాల్గొంటారు.

సవాళ్లు, భవిష్యత్

కార్నీ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన తరువాత, కెనడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, క్లైమేట్ చేంజ్ సమస్యలను పరిష్కరించడం, అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడం వంటి సవాళ్లను ఎదుర్కొనున్నారు. ఆయన ఆర్థిక పరిజ్ఞానం, అనుభవం కెనడా అభివృద్ధికి ఉపయోగపడుతాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 10 , 2025 | 07:19 AM