Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 10 , 2025 | 06:39 AM
దేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా ఒత్తిడికి లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయాలు సహా పలు అంశాల నేపథ్యంలో పసిడి రేట్లలో మార్పు వస్తుంది. ఈ నేపథ్యంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు అవుతున్నాయి. కానీ వెండి ధరలు మాత్రం కొంత స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నిర్ణయాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ పెరగడం, వడ్డీ రేట్ల మార్పు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు గోల్డ్ రేట్లు..
బంగారం, వెండి ధరలు ప్రతి రోజు కూడా మారుతుంటాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం 2025 మార్చి 10న తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 87,770కు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,390గా ఉంది. అదే సమయంలో వెండి ధర కేజీకి రూ. 108,000 స్థాయికి చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80,540కి చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,850కి చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ గోల్డ్ రేట్, 24 క్యారెట్ గోల్డ్ రేట్
చెన్నైలో రూ. 80,390, రూ. 87,770
ఢిల్లీలో రూ. 80,540, రూ. 87,850
కోల్‌కతాలో రూ. 80,390, రూ. 87,770
బెంగళూరులో రూ. 80,390, రూ. 87,770
హైదరాబాద్‌లో రూ. 80,390, రూ. 87,770
విజయవాడలో రూ. 80,390, రూ. 87,770
పూణేలో రూ. 80,390, రూ. 87,770
పాట్నాలో రూ. 80,440 రూ. 87,750
ముంబైలో రూ. 80,390, రూ. 87,770
కేరళలో రూ. 80,390, రూ. 87,770
బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలి
బంగారం స్వచ్ఛతను హాల్‌మార్కింగ్ ద్వారా గుర్తించడానికి వివిధ అంతర్జాతీయ సంస్థలు ప్రమాణాలను రూపొందించాయి. భారతదేశంలో BIS (Bureau of Indian Standards) హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతకు ప్రామాణిక గుర్తింపును ఇస్తుంది.
హాల్‌మార్క్ నంబర్ల అర్థం
24 క్యారెట్ – 999 (99.9% స్వచ్ఛత)
23 క్యారెట్ – 958 (95.8% స్వచ్ఛత)
22 క్యారెట్ – 916 (91.6% స్వచ్ఛత)
21 క్యారెట్ – 875 (87.5% స్వచ్ఛత)
18 క్యారెట్ – 750 (75% స్వచ్ఛత)
14 క్యారెట్ – 585 (58.5% స్వచ్ఛత)
క్యారెట్ ప్రాముఖ్యత
24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం, కానీ చాలా మృదువుగా ఉండటంతో ఆభరణాల తయారీలో చాలా తక్కువగా వినియోగిస్తారు
22 క్యారెట్ బంగారం ఎక్కువగా ఆభరణాలలో ఉపయోగిస్తారు
18 క్యారెట్ బంగారం కూడా ఆభరణాల కోసం వాడతారు
14 క్యారెట్ కంటే తక్కువ క్యారెట్ల బంగారం ఎక్కువగా డిజైనర్ జ్యువెలరీలో లేదా డెయిలీ వేర్ కోసం ఉపయోగిస్తారు
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News