Ayatollah Ali Khamenei: అమెరికాకు శిక్ష తప్పదు
ABN, Publish Date - Jun 24 , 2025 | 04:31 AM
ఇరాన్‌పై అమెరికా దాడి తర్వాత సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సోమవారం తొలిసారి స్పందించారు. అమెరికాకు శిక్ష తప్పదని హెచ్చరించారు.
Ayatollah Ali Khamenei: ఇరాన్‌పై అమెరికా దాడి తర్వాత సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సోమవారం తొలిసారి స్పందించారు. అమెరికాకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ట్రంప్‌ను ఓ జూదగాడిగా అభివర్ణించారు. అమెరికా తమ ప్రతీకార దాడులను ఎదుర్కోకతప్పదని హెచ్చరించారు. ఇరాన్ ఆర్మీ చీఫ్ రహీం మౌసవి కూడా అమెరికాపై తీవ్రంగా స్పందించారు. ‘‘అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించింది. మా పవిత్ర భూమికి హాని కలిగించింది. మా ప్రయోజనాల కోసం ఎంతటి చర్యకైనా వెనకాడబోము’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో చమురు ధరలపై ఆందోళన వద్దని, వాటిని స్థిరంగా ఉండేలా తాను చూస్తానని ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 04:34 AM