Ananta Shastra: సరిహద్దులకు అనంత శస్త్ర శక్తి
ABN, Publish Date - Sep 28 , 2025 | 12:53 AM
పాకిస్థాన్, చైనా సరిహద్దుల వెంబడి రక్షణ వ్యవస్థను మన సైన్యం మరింత బలోపేతం చేస్తోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన...
దేశీయ క్షిపణుల కొనుగోలుకు 30 వేల కోట్లతో టెండర్ నోటీసులు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: పాకిస్థాన్, చైనా సరిహద్దుల వెంబడి రక్షణ వ్యవస్థను మన సైన్యం మరింత బలోపేతం చేస్తోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘అనంత శస్త్ర’ క్షిపణి వ్యవస్థతో గగనతల రక్షణ శక్తి సామర్థ్యాలను పటిష్ఠం చేయనుంది. సుమారు రూ. 30 వేల కోట్లతో ఆ క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేయడానికి భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)కు టెండర్ నోటీసు జారీ చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఽఛేదించే ఈ క్షిపణి వ్యవస్థను డీఆర్‌డీవో తయారు చేసింది. గతంలో ఈ క్షిపణి వ్యవస్థను క్విక్ రియాక్షన్ సర్పేస్ టు ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్‌ఎ్‌సఏఎం) అని పిలిచేవారు. తర్వాత దీనికి అనంత శస్త్రగా నామకరణం చేశారు. 5 నుంచి 6 రెజిమెంట్ల ఈ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసి సరిహద్దుల్లో మోహరించనున్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం వీటి సేకరణకు తమ ముందుకు వచ్చిన ప్రతిపాదనను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వెంటనే ఆమోదించింది. కదులుతున్నపుడు కూడా శత్రువుల లక్ష్యాలను ఛేదించడం అనంత శస్త్ర ప్రత్యేకత. దీనిని చాలా వేగంగా ప్రయోగించవచ్చు. సుమారు 30 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ప్రస్తుతం ఆర్మీ వద్దనున్న ఆకాశ్‌తీర్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (ఎంఆర్‌ఎ్‌సఏఎం)లకు తోడుగా అనంత శస్త్ర ఆర్మీ అమ్ములపొదిలో ఉంటుంది.
Updated Date - Sep 28 , 2025 | 12:53 AM