ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fake Pakistan Football Team: జపాన్‌కు నకిలీ పాకిస్థాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు

ABN, Publish Date - Sep 18 , 2025 | 04:23 AM

జపాన్‌లో అడుగుపెట్టిన ఓ నకిలీ పాకిస్థాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు గుట్టురట్టయింది. ఈ జట్టు మోసం బయటపడటంతో అక్కడి నుంచి వెనక్కి పంపేసినట్టు ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ.....

  • ఎయిర్‌పోర్ట్‌ నుంచే తిప్పి పంపిన అధికారులు

లాహోర్‌, సెప్టెంబరు 17:జపాన్‌లో అడుగుపెట్టిన ఓ నకిలీ పాకిస్థాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు గుట్టురట్టయింది. ఈ జట్టు మోసం బయటపడటంతో అక్కడి నుంచి వెనక్కి పంపేసినట్టు ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) బుధవారం వెల్లడించింది. 22 మందితో ఉన్న నకిలీ ఫుట్‌బాల్‌ జట్టును జపాన్‌కు పంపడంలో ఓ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ ప్రమేయం ఉన్నట్టుగా పేర్కొంది. 15 రోజుల వీసాతో ఈ జట్టు జూన్‌లో జపాన్‌కు చేరుకుంది. నకిలీ ఆటగాళ్లు ఫుట్‌బాల్‌ కిట్స్‌ ధరించడమేకాకుండా పాకిస్థాన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ వద్ద రిజిస్టర్‌ అయి ఉన్నామని, ఓ జపనీస్‌ క్లబ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని కూడా చెప్పారు. అయితే వీరిపై అనుమానం రావడంతో జపనీస్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ప్రశ్నించారు. నకిలీ జట్టుగా గుర్తించి విమానాశ్రయం నుంచే వెనక్కి పంపించారు.

Updated Date - Sep 18 , 2025 | 04:23 AM