రాబోయే 2 దశాబ్దాల్లో బ్రిటన్ ఇస్లామిక్ దేశంగా మారొచ్చు: యూకే మాజీ మంత్రి
ABN, Publish Date - Jan 30 , 2025 | 10:33 PM
రాబోయే రెండు దశాబ్దాల్లో బ్రిటన్ ఇస్లామిక్ దేశంగా మారే ఛాన్స్ ఉందంటూ అక్కడి మాజీ మంత్రి సువెల్లా బ్రెవర్మన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌గా మారిన బ్రిటన్ మాజీ మంత్రి సువెల్లా బ్రెవర్‌మన్ మరోసారి సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. బ్రిటన్ ముస్లిం ఛాందసవాదుల చేతుల్లోకి వెళ్లొచ్చని, పాశ్చాత్య ప్రపంచానికి ఇరాన్ తరహా శత్రువుగా మారొచ్చని వ్యాఖ్యానించారు. బ్రిటన్ సంప్రదాయ వాద మేథో సంస్థ హెరిటేజ్ ఫౌండేషన్ వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కరుడుగట్టిన సంప్రదాయ వాదిగా పేరున్న సువెల్లా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. ఆయన విజయంతో పాశ్చాత్య ప్రపంచంలో ఉదారవాద భావజాలానికి ముగింపు పడొచ్చని అన్నారు(Britain).
US Plane Crash: అమెరికా విమాన ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూటి ప్రశ్న వైరల్
యూకేలోని కన్జర్వేటివ్ పార్టీకి సువెల్లా గతంలో కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వలసదారులు రువాండాకు బహిష్కరణకు గురి కావడం తన కల అని అప్పట్లో అన్నారు. వీధుల్లో బతుకీడ్చడం కొందరు కావాలని ఎంచుకునే జీవన విధానమంటూ పేదలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక తాజా కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో ఆమె పలు సంచలన కామెంట్స్ చేశారు. ‘‘యూకే ముస్లిం ఛాందసవాదం చేతుల్లోకి వెళితే ఏమవుతుంది. మన న్యాయవ్యవస్థ స్థానంలో షరియా చట్టం వస్తుంది. అణు ఆయుధ సంపత్తి ఇరాన్ తరహా పాలకుల చేతుల్లోకి వెళుతుంది. ఈ పరిస్థితి ప్రస్తుత బలహీన నాయకత్వమే కారణం కావొచ్చు. ఇలా జరిగే అవకాశం తక్కువే అయినా ఈ ప్రశ్నలు సంధించే ధైర్యం మనకుండాలి.’’ అని ఆమె చెప్పుకొచ్చారు. రాబోయే రెండు దశాబ్దాల్లో అమెరికాకు బ్రిటన్ ప్రధాన శత్రువు కావొచ్చని కూడా వ్యాఖ్యానించారు.
Washington DC: హెలికాప్టర్, విమానం ఢీ.. 28 మృతదేహాలు వెలికితీత
బ్రిటన్ ప్రధానికి అమెరికా అధ్యక్షుడితో పొసగక పోవచ్చని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఇక బ్రిటన్‌ను మరోసారి గొప్ప దేశంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, కన్జర్వేటివ్ పార్టీలో సంప్రదాయిక వాదానికి పెరుగుతున్న మద్దతుకు చిహ్నంగా ఈ వ్యా్ఖ్యలు భావించాలని అక్కడి విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక బ్రెవర్మన్ భర్త ఇప్పటికే నైజల్ ఫరాజ్‌కు చెందిన రిఫార్మ్ పార్టీలో చేరారు. సువెల్లా కూడా ఇదే బాటలో పయనించొచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
For International News And Telugu News
Updated Date - Jan 30 , 2025 | 10:38 PM