Washington DC: హెలికాప్టర్, విమానం ఢీ.. 28 మృతదేహాలు వెలికితీత
ABN , Publish Date - Jan 30 , 2025 | 07:06 PM
US Plane-Helicopter Crash: అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో రక్షణ శాఖకు చెందిన హెలికాప్టర్‌ను ఢీ కొట్టింది. అనంతరం పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో ఈ రెండు కూలిపోయాయి. నది నుంచి ఇప్పటి వరకు 28 మృతదేహాలను వెలికి తీశారు.

వాషింగ్టన్ డీసీ, జనవరి30: 64 మంది ప్రయాణికులతో వెళ్తున్న జెట్ విమానం, హెలికాప్టర్ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అనంతరం అవి పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎంత మంది మరణచారనే అంశంపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఇప్పటి వరకు పోటోమాక్ నది నుంచి 28 మంది ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతోన్నాయి.
బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టు రన్ వేపై విమానం దిగేందుకు సిద్దమవుతోన్న తరుణంలో యూఎస్ రక్షణ శాఖకు చెందిన హెలికాప్టర్‌ను ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది ఉన్నట్లు అమెరికన్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది.
అలాగే హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారని రక్షణ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ప్రయాణికుల కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తల కోసం..
Also Read: నెలల తరబడి ఇంటికి వెళ్లని ఆ ఉద్యోగులు.. రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read: జియో సిమ్ వాడుతున్నారా.. ఆ రెండు ప్లాన్స్ గోవిందా..
Also Read: కేజ్రీవాల్ ఇరికించాలనుకొని.. ఇరుక్కుపోయారా?
Also Read: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
For International News And Telugu News