Share News

Union Budget: నెలల తరబడి ఇంటికి వెళ్లని ఆ ఉద్యోగులు.. రిలీజ్ ఎప్పుడంటే..?

ABN , Publish Date - Jan 30 , 2025 | 06:17 PM

Union Budget: మరికొన్ని గంటల్లో బడ్జెట్‌ను పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ తయారీలో పలు కీలక అంశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే సిబ్బంది.. వారి వారి నివాసాలకు వెళ్లడానికి లేదు. అత్యవసరమైతే.. భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో వారు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సి ఉంటుంది.

Union Budget: నెలల తరబడి ఇంటికి వెళ్లని ఆ ఉద్యోగులు.. రిలీజ్ ఎప్పుడంటే..?
Finance Minister Nirmala Sitaraman

Budget 2025-26: మరికొన్ని గంటల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతేడాది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెడుతున్నారు.

అయితే జీఎస్టీ పేరుతో బాధుడు మోత మోగిపోతుంది. అలాంటి వేళ ఈ సారి ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో లాలింపులు, తాళింపులు ఏం ఉండనున్నాయో అంటూ సామాన్య మానవుడి నుంచి సంపన్న వర్గాల వరకు అందరూ మదనపడుతున్నారు. అయితే దేశంలో ప్రతి ఒక్కరిని ఇంతలా ఆలోచింప చేస్తున్న ఈ బడ్జెట్‌‌ను ప్రతి ఏడాది పార్లమెంట్‌లో ప్రవేశపెడతారన్న సంగతి అందరికి తెలిసిందే.

మరి ఏడాదిలో ఈ బడ్జెట్ రూపొందించడం ఎప్పుడు ప్రారంభిస్తారు. ఎప్పుటికి ఈ ప్రక్రియ ముగుస్తోంది. దీంతో ఎవరు పాల్గొంటారు. ఈ బడ్జెట్ రూపొందించే క్రమంలో పలు అంశాలు బయటకు వెళ్లే అవకాశముందా? బడ్జెట్‌ ముందు హల్వా ఎందుకు తయారు చేస్తారు. దీనిని కేంద్ర ఆర్థిక మంత్రే ఎందుకు వడ్డిస్తారు. తదితర ఆసక్తికర అంశాలు..


ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడతారు. అంతకు ఆరు నెలల ముందు నుంచి ఈ బడ్జెట్ రూపొందించే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ బడ్జెట్ రూపకల్పనలో పలువురు సలహాదారులు, బ్యూరోక్రాట్ల సహకారంతో ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ను రూపొందిస్తారు. అలాగే బడ్జెట్ రూపొందించే ముందు పరిశ్రమ వర్గాలు, ఆర్థిక వేత్తల అభిప్రాయాన్ని సైతం ఆర్థిక శాఖలోని ఉన్నతాధికారులు తీసుకుంటారు. బడ్జెట్ ప్లాన్ అంటే నిర్ధిష్ట కాలానికి ప్రభుత్వ ఆదాయ వ్యయాలు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రభుత్వ ఖర్చులు, ఆదాయం ఎలా ఉండనుందని లిఖితపూర్వకంగా సమర్పిస్తారు.

Also Read: జియో సిమ్ వాడుతున్నారా.. ఆ రెండు ప్లాన్స్ గోవిందా..


ఈ బడ్జెట్ రూపకల్పన తుది దశకు చేరుకొన్న అనంతరం హల్వా వేడుకను ఆనవాయితీగా నిర్వహిస్తారు. బడ్జెట్ రూపకల్పన కోసం శ్రమించిన వ్యక్తుల నోటిని తీపి చేయడం కోసం ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఇక హల్వా వేడుక నిర్వహించిన నాటి నుంచి అధికారుల లాకిన్‌ పీరియడ్‌ ప్రారంభమవుతుంది. అంటే బడ్జెట్‌ రూపకల్పనలో భాగమైన అధికారులు, సిబ్బంది ఎవరూ ఇంటికి వెళ్లడానికి వీలుండదు. నార్త్‌ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయం పరిసరాల్లోనే వారంతా ఉండాల్సి ఉంటుంది.

Also Read: కేజ్రీవాల్‌ ఇరికించాలనుకొని.. ఇరుక్కుపోయారా?


బడ్జెట్‌ డాక్యుమెంట్లను ప్రింట్‌ తీసే ప్రక్రియ సైతం ఇక్కడే జరుగుతుంది. అవన్నీ పార్లమెంట్‌కు చేరుకునే వరకు వారంతా అక్కడే ఉండాలి. అంతేకాదు ఇంట్లో వారితో కూడా మాట్లాడడానికి వీలుండదు. మరి అత్యవసరమైతే మాత్రం భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో కుటుంబ సభ్యులతో ఫోన్‌ మాట్లాడాల్సి ఉంటుంది. బడ్జెట్‌లో ఏ చిన్న సమాచారమూ బయటకు వెళ్లకూడదనే ఉద్దేశంతో ఈ తరహా నిబంధనలు విధించారు. ఇక సాధారణ బడ్జెట్‌ను నార్త్‌ బ్లాక్‌లోని బేస్‌మెంట్‌లోని ప్రింటింగ్‌ ప్రెస్‌లో ముద్రిస్తారు.

Also Read: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్


ఇక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి దాదాపు 10 రోజుల ముందు ఈ హల్వా వేడుకను నిర్వహిస్తారు. న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న ఆర్థిక శాఖ కార్యాలయంలోని కిచెన్‌లో ఈ హల్వాను తయారు చేస్తారు. ఈ హల్వా తయారీలో భాగంగా ఆర్థిక మంత్రి స్వయంగా గరిట తిప్పుతారు. ఈ హల్వా సిద్దమైన అనంతరం దానిని ఆర్థిక శాఖ అధికారులతోపాటు సిబ్బందికి కేంద్ర మంత్రి స్వయంగా వడ్డిస్తారు. బడ్జెట్ రూపకల్పన కోసం శ్రమించిన వారికి ఈ హల్వాను కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా వడ్డిస్తారు.


గతంలో రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్‌ ఫ్రింట్ అయ్యేది. అయితే 1950లో బడ్జెట్‌ లీక్‌ అయింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రింటింగ్ ప్రెస్‌ను మింట్‌ రోడ్డుకు తరలించారు. నాటి నుంచి అక్కడే ప్రింట్ అయ్యేది. ఆ తర్వాత అంటే.. 1980లో నార్త్‌ బ్లాక్‌ బేస్‌మెంట్‌కు మార్చారు.

For National news And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 06:17 PM