US Plane Crash: అమెరికా విమాన ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూటి ప్రశ్న వైరల్
ABN , Publish Date - Jan 30 , 2025 | 09:06 PM
అమెరికా విమాన ప్రమాదంపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రశ్న సంధించారు. విమానం స్పష్టంగా కనిపిస్తున్నా హెలికాఫ్టర్ పైకో లేదా కిందకో వెళ్లకుండా నేరుగా విమానాన్ని ఎందుకు ఢీకొట్టిందని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: వాషింగ్టన్ డీసీలో ఓ విమానాన్ని లాండవుతున్న సమయంలో ఆర్మీ హెలికాఫ్టర్ ఢీకొన్న ఘటనలో రెండు విహంగాల్లోని వారందరూ మృతి చెందారని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వేసిన ప్రశ్న నెట్టింట వైరల్ అవుతోంది. తమకూ ఇదే సందేహం కలిగిందంటూ నెట్టింట అనేక మంది ట్రంప్ పోస్టుకు భారీగా స్పందిస్తున్నారు (america).
Washington DC: హెలికాప్టర్, విమానం ఢీ.. 28 మృతదేహాలు వెలికితీత
ప్రమాదం జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ట్రంప్ ఈ ప్రశ్న సంధించారు. ‘‘ఈ విమానం పద్ధతి ప్రకారం, ఎయిర్ పోర్టులో ల్యాండయ్యేందుకు వస్తోంది. కానీ హెలికాఫ్టర్ మాత్రం నేరుగా విమానం వైపు చాలా సేపు ప్రయాణించింది. అసలు ఆ రాత్రి అంతా స్పష్టంగా కనబడుతోంది. విమానం లైట్లు కూడా స్పష్టంగా కనిపించి ఉండాలి. మరి హెలికాఫ్టర్ విమానాన్ని చూడగానే పైకో లేదా కిందికో లేదా మరోవైపో ఎందుకు మళ్లలేదు. కంట్రోల్ టవర్ హెలికాఫ్ట్‌ర్‌ను విమానం కనబడుతోందా అని అడగకుండా పైకో లేదా కిందికో మళ్లమని ఎందుకు చెప్పలేదు. ఈ స్థితి చాలా దారుణమైనది. ఇది మంచిది కాదు’’ అని ట్రంప్ ముక్తాయించారు.
American Airlines Flight Collides: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..
దీంతో, అనేక మంది ట్రంప్‌కు జత కూడారు. అదే తరహా ప్రశ్న లేవనెత్తారు. ‘‘ఇది నాకు యాక్సిడెంట్ లాగా కనిపించట్లేదు. హెలికాఫ్టర్ నేరుగా విమానం వైపు దూసుకెళ్లినట్టు నాకు వీడియోల్లో కనిపిస్తోంది’’ అని ఓ వ్యక్తి పేర్కొన్నారు. కుట్ర కోణం ఉందని అనేక మంది సందేహాలు వెలిబుచ్చారు.
ఇక తాజా సమాచారం ప్రకారం, ప్రమాద సమయంలో అమెరికా విమానంలో 64 మంది పఉన్నారు.హెలికాఫ్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారు. అయితే, ఈ ఘటనలో యావన్మంది మరణించినట్టు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న నదిలోంచి ఇప్పటివరకూ 28 మంది మృతదేహాలను వెలికితీసినట్టు తెలిసింది. ఇక ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు అమెరికా పౌర విమానయాన శాఖ కూడా పేర్కొంది.
For International News And Telugu News