Share News

American Airlines Flight Collides: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..

ABN , Publish Date - Jan 30 , 2025 | 09:07 AM

American Airlines Flight Collides: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం ఓ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన నేషన్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

American Airlines Flight Collides: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..
American Airlines Flight Collides

American Airlines Flight Collides: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం ఓ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన నేషన్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం, హెలికాప్టర్ ఢీకొనడంతో ఆ రెండూ పోటోమాక్ నదిలో పడిపోయాయి. వెంటనే అలర్ట్ అయిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్, బోట్ల సహాయంతో గాలిస్తున్నారు. 78 మంది వరకు కూర్చునే అవకాశం ఉన్న బొంబార్డియన్ CRJ700 లోకల్ జెట్ రన్‌వే మీదకు వస్తుండగా హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విమనాంలో 60 మంది ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలో టేకాఫ్‌, ల్యాండింగ్‌‌లను నిలిపివేశారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, పోటోమాక్ నదిలో విమానం, ప్రయాణికుల కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

Updated Date - Jan 30 , 2025 | 09:11 AM