Elon Musk: బైడెన్ ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 29 , 2025 | 09:49 AM
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ బైడెన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ISSలో చిక్కుకున్నారని, వారిని తీసుకురావడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు.
అమెరికా బిలియనీర్, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జూన్ 2024 నుంచి అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు వ్యోమగాములను తిరిగి రప్పించే విషయంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో జూన్ 2024లో అంతరిక్ష కేంద్రం (ISS)కి చేరుకున్నారు. వారు తమ క్రూ 9 మిషన్‌లో ఆందోళన లేకుండా పని చేస్తున్నప్పటికీ, అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన ఈ ఇద్దరినీ ISSలో చాలా కాలం పాటు "ఇరుక్కుపోయోలా" చేసిందని మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా ఏమన్నారంటే..
ఈ విషయం గురించి ఎలాన్ మస్క్ ఓ ట్వీట్‌లో ప్రకటించారు. "ప్రస్తుతం @Space_Stationలో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను వీలైనంత త్వరగా కిందకు తీసుకురావాలని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ @SpaceX ని కోరినట్లు చెప్పారు. మేము దీనిని సాధ్యం చేస్తామని మస్క్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బైడెన్ పరిపాలనపై ఆరోపణలు చేస్తూ.. వారిని చాలా కాలం అక్కడే వదిలేయడం చాలా దారుణమని మస్క్ అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నాసా మాత్రం ఆ ఇద్దరు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని, వారి పరిస్థితి బాగానే ఉందని వెల్లడించింది.
కష్టతరమైన ప్రయాణం..
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్ 2024లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ISSకి వెళ్లారు. ఈ ప్రయాణం చాలా కష్టతరమైనదని చెబుతున్నారు. ఈ క్రమంలో నాసా, బోయింగ్ మిగతా సిబ్బందితో కలిసి అంతరిక్ష నౌకలో సమస్యలను పరిష్కరించడానికి ఆగస్టు 2024లో నాసాతో కలిసి స్పేస్‌ఎక్స్ నుంచి తిరిగి వచ్చే ప్రణాళికను ప్రారంభించారు. అయినప్పటికీ నాసా ఇంకా వారిని తిరిగి తీసుకురాలేకపోయింది. సాంకేతిక సమస్యలు వస్తుండటంతో 2025 ఫిబ్రవరిలో మాత్రమే సునీతా, బుచ్ ISS నుంచి ఇంటికి తిరిగే అవకాశం ఉందని తెలిసింది.
డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా
ఈ క్రమంలో స్పేస్‌ఎక్స్ వారు కొత్తగా "ఫ్రీడమ్" క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఈ ప్రయాణాన్ని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. "క్రూ-9" మిషన్‌ని క్రూ-10 ప్రారంభం తర్వాత మార్చి 2025లో ISSకి కొత్త ప్రయోగం చేయనున్నారు. ఈ ప్రక్రియ వివాదాస్పదంగా మారినా, అంతరిక్ష పరిశ్రమలో స్పేస్‌ఎక్స్ పురోగతి ప్రశంసనీయంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. స్పేస్‌ఎక్స్ అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు విశ్వసనీయతనందిస్తూ అంతరిక్ష పరిశ్రమలో గొప్ప మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి:
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Read More International News and Latest Telugu News
Updated Date - Jan 29 , 2025 | 09:49 AM