COVID-19: ఆసియాలో కోరలు చాస్తున్న కొవిడ్
ABN, Publish Date - May 21 , 2025 | 03:33 AM
ఆసియా ఖండంలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. సింగపూర్, థాయ్‌లాండ్, హాంకాంగ్, చైనా దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి, భారత్‌లోనూ 257 కొత్త కేసులు నమోదయ్యాయి.
హాంకాంగ్, సింగపూర్‌లో వేలల్లో కేసులు
ఆస్పత్రుల్లో చేరికలు.. తీవ్రత తక్కువ
భారత్‌లోనూ 250 కేసుల నమోదు
న్యూఢిల్లీ, మే 20: కొవిడ్ మహమ్మారి ఆసియా ఖండంలో మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్, చైనాల్లో వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివిటీ రేటు పెరుగుతోంది. భారత్‌లోనూ 257 కేసులు నమోదయ్యాయి. జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలు ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 కారణంగా కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది. జేఎన్.1 రకం వేరియంట్ పెరగడాన్ని బట్టి.. ఇంతకు మునుపు తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. సింగపూర్‌లో ఏప్రిల్ 27-మే 3 మధ్య 14 వేల కేసులు వెలుగు చూడగా.. అంతకు ముందు వారం 11 వేల కేసులున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే.. ఐసీయూలో చేరికలు స్వల్పంగా ఉన్నట్లు తెలిపింది. అటు థాయ్‌లాండ్‌లో ఈనెల 11-17 మధ్య కాలంలో 33 వేల కేసులు నమోదయ్యాయి. ఒక్క బ్యాంకాక్‌లోనే 6 వేల కేసులున్నాయి. హాంకాంగ్‌లోనూ కొవిడ్ కేసులు గత నెల 6-12 తేదీల(6.21ు)తో పోలిస్తే.. 13.66శాతానికి చేరుకుంది. చైనాలో పాజిటివిటీ రేటు 3.3ు నుంచి 6.3శాతానికి పెరిగింది. భారత్‌లో కొవిడ్ కేసులు 257కు చేరడంతో వైద్య సేవల డైరెక్టర్ జనరల్ సోమవారం వైద్యాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News
Updated Date - May 21 , 2025 | 03:33 AM