Worlds Tallest Bridge: ఆకాశాన్నంటే ఎత్తు.. ఐఫిల్ టవర్ క న్నా బరువు!
ABN, Publish Date - Sep 30 , 2025 | 03:47 AM
చైనా మరోసారి తన ఇంజనీరింగ్ అద్భుతంతో ప్రపంచాన్ని అబ్బురపరిచింది. నైరుతి చైనాలోని గిజౌ ప్రావిన్స్‌లోని ఓ...
చైనా ఇంజనీరింగ్ అద్భుతం.. ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి
బీజింగ్, సెప్టెంబరు 29: చైనా మరోసారి తన ఇంజనీరింగ్ అద్భుతంతో ప్రపంచాన్ని అబ్బురపరిచింది. నైరుతి చైనాలోని గిజౌ ప్రావిన్స్‌లోని ఓ భారీ లోయపై 625 మీటర్ల ఎత్తులో నిర్మించిన వంతెనను ఆదివారం అధికారికంగా ప్రారంభించింది. ’హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్’ పేరిట నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జిగా నిలిచింది. మొన్నటివరకు లోయ చుట్టూ తిరిగి అవతలి వైపుకు చేరుకునేందుకు 2 గంటల సమయం పట్టేది. ఇప్పుడు రెండు నిమిషాల్లోనే వంతెనపై రయ్యిమంటూ దూసుకెళ్లొచ్చు. వంతెన పొడవు 2,890 మీటర్లు కాగా, 22 వేల టన్నుల ఉక్కుతో నిర్మించడం గమనార్హం. అంటే ప్రపంచ ప్రఖ్యాత ఐఫిల్ టవర్ కన్నా మూడు రెట్ల అధిక బరువుతో దీన్ని నిర్మించారు.
Updated Date - Sep 30 , 2025 | 03:47 AM