ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

UK Immigration Policy: వలసలపై బ్రిటన్‌ కఠిన వైఖరి

ABN, Publish Date - May 13 , 2025 | 05:22 AM

బ్రిటన్‌ వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పౌరసత్వం పొందేందుకు ప్రస్తుతం ఉన్న అయిదేళ్ల నిరీక్షణ సమయాన్ని పదేళ్లకు పెంచాలని నిర్ణయించింది.

లండన్‌, మే 12: విదేశీయుల వలసలపై బ్రిటన్‌ కఠిన వైఖరి అవలంబించనుంది. పౌరసత్వం పొందడం కోసం ప్రస్తుతం ఉన్న అయిదేళ్ల నిరీక్షణ సమయాన్ని పదేళ్లకు పెంచనుంది. వలసల విధానంపై పార్లమెంటులో ప్రభుత్వం శ్వేతపత్రాన్ని సమర్పించనున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని స్టార్మర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. వృత్తి, విద్య, కుటుంబం తదితర కేటగిరీల వీసాలపై వచ్చిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. భారతీయులు సహా ఇతర దేశాల వారు బ్రిటన్‌లో అయిదేళ్ల పాటు నివసిస్తుంటే ప్రస్తుతం వారికి ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభిస్తుంది. దీనికి అడ్డుకట్టవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైపుణ్యాలు ఉన్నవారికే పౌరసత్వం మంజూరులో ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ వర్గంలో నర్సులు, డాక్టర్లు, ఇంజినీర్లు, కృత్రిమ మేధ లీడర్లు ఉండనున్నారు. కాగా, కొత్త విధానంలో.. వలస వచ్చేవారికి హయ్యర్‌ స్టాండర్డ్‌ ఇంగ్లీష్‌ వచ్చి ఉండాలని పేర్కొన్నారు. బ్రిటన్‌లో నివసించే విదేశీయులపై ఆధారపడ్డ వారు మేజర్లయితే వారికి కూడా తప్పనిసరిగా కనీస ఇంగ్లీషు పరిజ్ఞానం ఉండాలన్నారు.

Updated Date - May 13 , 2025 | 08:27 AM