ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US immigration: అమెరికాలో ‘ఓపీటీ’రద్దుకు చట్టసభలో బిల్లు

ABN, Publish Date - Apr 10 , 2025 | 04:56 AM

అమెరికాలో చదివిన విదేశీ విద్యార్థులు ఓపీటీ ద్వారా పని అనుభవం పొందే అవకాశాన్ని తొలగించే బిల్లు ప్రవేశపెట్టారు. ఇది అమలవుతుందని భావించడంలేదని నిపుణులు చెబుతున్నప్పటికీ, విదేశీ విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది.

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 9: అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రాంను తొలగించే బిల్లును అక్కడి చట్ట సభలో ప్రవేశపెట్టారు. దీంతో అక్కడి విదేశీ విద్యార్థుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ సభ్యుడు పాల్‌ గోసర్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ‘విద్యార్థి వీసాలపై అమెరికాలో చదువుకునేందుకు వస్తున్న ఏటా లక్ష మంది విదేశీయులు ఓపీటీ కింద నమోదు చేసుకొని విద్యాభ్యాసం అయిపోయాక కూడా ఇక్కడే మూడేళ్ల పాటు ఉంటున్నారు. దురాశపరులైన ఇక్కడి వ్యాపారులు నైపుణ్యం, ఉన్నత విద్యావంతులైన అమెరికన్లను కాదని చవకగా వస్తున్న విదేశీ విద్యార్థులకే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఓపీటీ విధానం విదేశీ కార్మికులనే ప్రోత్సహిస్తోంది’ అని బిల్లులో పేర్కొన్నారు. అయితే ఈ బిల్లు సెనెట్‌లో ఆమోదం పొందే అవకాశం లేదని, ఈ బిల్లు ఆమోదానికి కావాల్సిన సంఖ్యాబలం రిపబ్లికన్లకు లేదని ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాదులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి..

Tahwwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Updated Date - Apr 10 , 2025 | 04:56 AM