Bus Passengers Kidnap: 9 మంది ప్రయాణికుల్ని కిడ్నాప్ చేసి, ఆపై హత్య..
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:08 PM
Bus Passengers Kidnap: పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన 9 మందిని కిందకు దిగమన్నారు. తర్వాత వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత వారందరినీ దారుణంగా కాల్చి చంపేశారు. పోలీసు అధికారులకు హత్యలకు సంబంధించిన సమాచారం అందింది.
పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. తిరుగుబాటుదారులు 9 మంది బస్సు ప్రయాణికుల్ని కిడ్నాప్ చేసి.. ఆపై హత్య చేశారు. శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. జోబ్ అసిస్టెంట్ కమిషనర్ ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. శుక్రవారం ఓ బస్సు జోబ్ ఏరియాలోని నేషనల్ హైవేపై వెళుతూ ఉంది. ఓ చోట తిరుగుబాటుదారులు బస్సును అడ్డగించారు. గన్నులతో బెదిరించి బస్సులోకి ఎక్కారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిని ఐడీ కార్డులు చూపించమని అడిగారు.
పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన 9 మందిని కిందకు దిగమన్నారు. తర్వాత వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత వారందరినీ దారుణంగా కాల్చి చంపేశారు. పోలీసు అధికారులకు హత్యలకు సంబంధించిన సమాచారం అందింది. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటుదారులు గత కొంతకాలం నుంచి పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన వారిని టార్గెట్ చేసి చంపుతున్నారు. బలూచిస్తాన్‌లో గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.
కాగా, ఈ దారుణానికి ఒడిగట్టింది ఏ గ్రూపు అన్నది తెలియరాలేదు. ఇప్పటి వరకు ఏ గ్రూపు కూడా ఈ హత్యలు చేసింది తామేనని ప్రకటించుకోలేదు. అయితే, గతంలో బలోచ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇలాంటి హత్యలకు పాల్పడ్డాయి. పంజాబ్ ప్రజల్ని టార్గెట్ చేసి చంపేశాయి. ఇక, తిరుగుబాబుదారులు మరో మూడు చోట్ల కూడా దాడులకు పాల్పడ్డారు. క్వెట్టా, లోరాలాయ్, మస్తంగ్‌లలో దాడులు చేశారు. అయితే, భద్రతా దళాలు ఈ దాడుల్ని విజయవంతంగా తిప్పికొట్టాయి.
ఇవి కూడా చదవండి
టెన్నిస్ ప్లేయర్ హత్య.. ఈ మ్యూజిక్ వీడియోనే కారణం..
స్టాలిన్‌కు ఈపీఎస్ కౌంటర్.. ముందు మీ అవినీతి గురించి చెప్పండి
Updated Date - Jul 11 , 2025 | 01:12 PM