Diabetes Awareness: 45 ఏళ్లు దాటిన ప్రతి ఐదుగురిలో ఒకరికి మధుమేహం
ABN, Publish Date - Aug 09 , 2025 | 05:27 AM
భారత్‌లో మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. 2019లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 45 ఏళ్లు అంతకంటే
భారత్‌లో మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. 2019లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు మధుమేహంతో జీవిస్తున్నట్టు గుర్తించారు. వారిలో కూడా ప్రతి ఐదుగురిలో ఇద్దరికి తమకు ఈ వ్యాధి ఉన్నట్టు తెలియదని ఈ అధ్యయనం పేర్కొంది. లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. భారత్‌లో మధ్య వయస్కులు, వృద్ధుల్లో మధుమేహం కేసులు పెరుగుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. 2017-2019 మధ్య కాలంలో 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 60 వేల మందిపై లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా (ఎల్‌ఏఎ్‌సఐ) ఒక సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు ఎక్కువగా డయాబెటిస్ బారిన పడుతున్నట్టు గుర్తించింది.
Updated Date - Aug 09 , 2025 | 05:27 AM