Metabolism Mistakes: ఈ పొరపాట్లు చేస్తున్నారా.. జీవక్రియలు నెమ్మదిస్తాయి జాగ్రత్త
ABN, Publish Date - Jul 21 , 2025 | 09:40 AM
తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగా జీవక్రియలు నెమ్మదిస్తాయి. కాలక్రమంలో ఇది పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది. మరి ఈ విషయంపై వైద్యులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: శరీరంలో జీవక్రియలు వేగంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అయితే, చాలా మందికి జీవక్రియలు అంటే ఏమిటో తెలియదు. సింపుల్‌గా చెప్పాలంటే.. పోషకాలను శక్తి, ఇంధనంగా మార్చే ప్రక్రియలనే జీవక్రియలని అంటారు. అయితే, తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల జీవక్రియలు నెమ్మదిస్తాయి. అవేంటంటే..
బిజీగా ఉన్నామంటూ ఓ పూట తిండి మానేస్తే జీవక్రియలు నెమ్మదిస్తాయి. దీర్ఘకాలంలో ఈ అలవాటు చేటు చేస్తుంది.
ఎలాంటి కసరత్తులు చేయకుండా ఉండటం కూడా తప్పే. ఇది కూడా జీవక్రియలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
కంటి నిండా నిద్రలేకపోతే శరీరంలోని హార్మోన్‌ల మధ్య సమతౌల్యం తప్పుతుంది. అంతిమంగా జీవక్రియలు నెమ్మదిస్తాయి.
ఎలాగైనా బరువు తగ్గాలనే తాపత్రయంలో అతిగా ఉపవాసాలు ఉన్నా జీవక్రియలు నెమ్మదించి ఆరోగ్యం దెబ్బతింటుంది.
ప్రోటీన్‌లకు శరీరంలో ఉష్ణాన్ని పెంచే లక్షణం ఉంటుంది. ఫలితంగా శరీరంలో కెలొరీలు అధికంగా ఖర్చవుతాయి. ప్రోటీన్లు తక్కువగా ఉన్న ఆహారం తింటే కూడా జీవక్రియలు నెమ్మదిస్తాయి.
ఒంట్లో శక్తి ఉత్పత్తికి నీరు కీలకం. డీహైడ్రేషన్ బారిన పడ్డ సందర్భాల్లో శక్తి ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి, తగినంత నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
ఇక జీవక్రియలు క్రమపద్ధతిలో సాగేందుకు భోజనం విషయంలో సమయపాలన అవసరం. ఇలా కాకుండా ఇష్టారీతిన ఎప్పుడుపడితే అప్పుడు ఆహారం తింటూ ఉంటే ఆరోగ్యం దెబ్బతినడం పక్కా.
ఒంట్లో కొవ్వు కరిగించడంలో కండరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి, బరువులు ఎత్తడం వంటి స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ కసరత్తులు చేస్తుంటేనే కండరాలు పటిష్ఠంగా మారి కొవ్వు త్వరగా కరిగిపోతుంది. జీవక్రియలు వేగవంతమై బరువు నియంత్రణలో ఉంటుంది.
అధిక ఒత్తిడి కూడా జీవక్రియలకు ఆటంకాలు కలిగిస్తుంది. ఒత్తిడి కారణంగా కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరిగి జీవక్రియలకు ప్రతిబంధకంగా మారతాయి.
తీపి అధికంగా ఉండే బేకరీ ఉత్పత్తులు కూడా జీవక్రియలకు చేటు చేస్తాయి.
ఈ విషయాలపై అవగాహనతో జీవనశైలిలో మార్పులు చేసుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
చాయ్‌తో పాటు బిస్కెట్లు తింటారా.. మరి ఈ విషయాల గురించి తెలుసా
భోజనం చేసిన వెంటనే ధూమపానం.. ఇలా చేస్తే రిస్క్‌లో పడ్డట్టే..
Updated Date - Jul 21 , 2025 | 09:50 AM