Mycoplasma pneumoniae: జాగ్రత్త.. పిల్లలపై మైకోప్లాస్మా పంజా..
ABN, Publish Date - Feb 20 , 2025 | 11:59 AM
పిల్లలపై మైకోప్లాస్మా న్యుమోనియా(Mycoplasma pneumoniae) కేసులు పంజా విసురుతున్నాయి. ఈ తరహా కేసులు ఇటీవల పెరుగుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
- పెరుగుతున్న న్యుమోనియా కేసులు
- 15 ఏళ్లలోపు వారిపై ఎక్కువ ప్రభావం
- అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
హైదరాబాద్ సిటీ: పిల్లలపై మైకోప్లాస్మా న్యుమోనియా(Mycoplasma pneumoniae) కేసులు పంజా విసురుతున్నాయి. ఈ తరహా కేసులు ఇటీవల పెరుగుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఏడాది నుంచి పదిహేనేళ్ల లోపు పిల్లలు దీని బారిన అధికంగా పడుతున్నారని చెబుతున్నారు. కాలేయం, మెదడుపై మైకోప్లాస్మా న్యుమోనియా ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే కొందరిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స చేయాలని వైద్యులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు దీర్ఘకాలికంగా తీవ్రమైన న్యుమోనియా కేసులు ఆస్పత్రికి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: పాలమూరు బిడ్డలకు అండగా ఉంటాం..
ఊపిరితిత్తులపై ప్రభావం
దీర్ఘకాలిక మైకోప్లాస్మా న్యుమోనియా ఉన్న పిల్లలకు కొన్నిసార్లు ఊపిరితిత్తుల పనితీరులో ఇబ్బందులు ఉంటాయని, బ్రాంకోస్కోపీ చేయాల్సి ఉంటుందని వైద్యులు వివరించారు. మైకోప్లాస్మా న్యుమోనియా, ఇన్ల్ఫుయెంజా న్యుమోనియా కలిసి ఉంటే సమస్య తీవ్రం అవుతుందన్నారు. మైకోప్లాస్మా న్యుమోనియా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో కచ్చితమైన కారణాలు లేవని, అసాధారణ వాతావరణం ఓ కారణంగా భావించాల్సి ఉంటుందని వివరించారు.
కేసులు ఎక్కువగానే ఉన్నాయి
న్యుమోనియాతో వచ్చే పిల్లల్లో గతంలో పది నుంచి 20 శాతం మైకోప్లాస్మా ఉంటే, ఇప్పుడు 60 నుంచి 80 శాతం ఆ కేసులే ఉంటున్నాయి. ఓపిలో దాదాపు 40 నుంచి 50 శాతం కేసులను చూస్తున్నాం. ఈ కేసులు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయో కారణాలను స్పష్టంగా గుర్తించలేకపోతున్నాం. కొందరికి బ్రాంకోస్కోపి, ఇతర ప్రత్యేక వైద్యం అందించాల్సి ఉంటుంది. విపరీతమైన దగ్గు, జలుబు, జ్వరం ఉంటే అనుమానించి డాక్టర్‌కు చూపించాలి.
- డాక్టర్ పిల్లరిశెట్టి నవీన్ సారథి,
పీడియాట్రిక్ పల్మనాలజిస్టు, రెయిన్‌బో చిల్డ్రన్ ఆస్పత్రి
ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్ టీ స్టాల్’ వివాదం
ఈవార్తను కూడా చదవండి: రోస్టర్ విధానంలో లోపాలు సరిచేయండి
ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్ పాల్గొనాలి..
Read Latest Telangana News and National News
Updated Date - Feb 20 , 2025 | 11:59 AM