KVS Admissions 2025 : కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరితేదీ అప్పుడే..
ABN, Publish Date - Mar 08 , 2025 | 01:58 PM
KVS Admissions 2025 : కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS)2025 సంవత్సరంలో అడ్మిషన్ నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. బాల్వాటిక 1 టు 3, క్లాస్ 1 అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ మార్చి 7న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు, సంరక్షకులు వెంటనే KVS అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తుకు చివరితేదీ, అర్హత మరిన్ని పూర్తి వివరాల కోసం..
KVS Admissions Notification 2025 : కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) 2025 సంవత్సరానికి అడ్మిషన్ల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 1వ తరగతి, బాల్వాటిక 1 నుంచి 3 స్థాయుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మార్చి 7న మొదలయ్యాయి. మార్చి 21, 2025 రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ విండో తెరిచి ఉంటుంది. అర్హత కలిగిన తల్లిదండ్రులు లేదా సంరక్షకులు KVS అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.in ని సందర్శించి గడువులోగా అప్లై చేసుకోండి.
KVS అడ్మిషన్లు 2025 ముఖ్యమైన తేదీలు :
1.2025-26 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి, బాల్వాటిక (ఎంపిక చేసిన కెవిలలో) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మార్చి 7 నుంచి ప్రారంభమైంది.
2. రిజిస్ట్రేషన్ చివరి తేదీ మార్చి 2. రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
3. మార్చి 25న క్లాస్ 1 కి ఎంపికైన, వెయిట్‌లిస్ట్ చేసిన రిజిస్టర్డ్ అభ్యర్థుల తాత్కాలిక జాబితాలు విడుదల.
4. మార్చి 25న బాల్వాటికకు ఎంపికైన, వెయిట్‌లిస్ట్ అయిన రిజిస్టర్డ్ అభ్యర్థుల తాత్కాలిక జాబితా రిలీజ్.
5. ఏప్రిల్ 2, 2025న రెండవ తాత్కాలిక జాబితా
6. ఏప్రిల్ 7, 2025న మూడవ తాత్కాలిక జాబితా
KVS అడ్మిషన్ కోసం అవసరమైన పత్రాలు : తల్లిదండ్రులు లేదా సంరక్షకులు రిజిస్ట్రేషన్ సమయంలో క్రింద పేర్కొన్న పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
1. పిల్లల జనన ధృవీకరణ పత్రం.
2. ఇటీవలే తీసుకున్న పిల్లల పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
3. చిరునామా రుజువు (ఆధార్ కార్డ్, ఓటరు ID లేదా యుటిలిటీ బిల్లు)
4. బదిలీ సర్టిఫికేట్ (వర్తిస్తే)
5. కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
వయోపరిమితి : అన్ని తరగతుల వయస్సులు మార్చి 31, 2025 నాటికి లెక్కిస్తారు. వయోపరిమితి గురించి మరింత తెలుసుకోవడానికి KVS ప్రవేశ మార్గదర్శకాలు 2025-26 చదవండి .
1. మొదటి తరగతిలో ప్రవేశానికి కనీస వయస్సు 6 సంవత్సరాలు.
2. బాల్వాటిక - 1కు 3 నుండి 4 సంవత్సరాలు, బాల్వాటిక - 2కు 4 నుండి 5 సంవత్సరాలు, బాల్వాటిక - 3 కి 5 నుండి 6 సంవత్సరాలు ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
Step 1: ముందుగా https://kvsangathan.nic.in లోని అడ్మిషన్ పోర్టల్‌కు వెళ్లండి.
Step 2: హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న “అడ్మిషన్ 2025-26” లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: దీని తర్వాత, “న్యూ రిజిస్ట్రేషన్” బటన్‌పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ ఆధారాలను రూపొందించండి.
Step 4: ఇప్పుడు జనరేట్ చేసిన ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి. ఫారమ్ నింపి స్కాన్ చేసిన అవసరమైన పత్రాల కాపీలను అప్‌లోడ్ చేయండి. ఆన్‌లైన్ చెల్లింపు చేసి ఆపై సబ్మిట్ చేయండి.
Step 5: భవిష్యత్తు అవసరాల దరఖాస్తు చేసిన ఫారంను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోండి.
బాల్వాటిక అడ్మిషన్లు 2025-26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read Also : Exams: టెన్త్ పరీక్షల్లో కొత్తగా 24 పేజీలతో ఆన్సర్ షీట్
ఇంటర్ పరీక్షలపై బిగ్ అప్డేట్.. కేంద్రాల వద్ద అవి ఫ్రీ..
Exams: పరీక్షల వేళ.. పరేషాన్ కావొద్దు
Updated Date - Mar 08 , 2025 | 02:14 PM