Assistant Public Prosecutor: పబ్లిక్ ప్రాసిక్యూటర్స్
ABN, Publish Date - Sep 08 , 2025 | 06:12 AM
తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా టీజీ ప్రాసిక్యూషన్ సర్వీస్(కేటగిరి) విభాగంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్(ఏపీపీ)గా పనిచేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది
తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా టీజీ ప్రాసిక్యూషన్ సర్వీస్(కేటగిరి) విభాగంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్(ఏపీపీ)గా పనిచేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 118 ఏపీపీ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను కోరుతున్నారు.
పోస్టులు: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్(ఏపీపీ) - 118 ఖాళీలు
మల్టీ జోన్-1: 50 పోస్టులు(డైరెక్ట్ 38, బ్యాక్‌లాగ్ 12)
మల్టీ జోన్-2: 68 పోస్టులు(డైరెక్ట్ 57, బ్యాక్‌లాగ్ 11)
వయస్సు: 2025 జూలై 1 నాటికి 34 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్స్‌కు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కనీసం మూడు సంవత్సరాలు క్రిమినల్ కోర్డు ప్రాక్టీసు చేసి ఉండాలి. అలాగే 2025 ఆగస్టు 15 తేదీ నాటికి ప్రాక్టీసింగ్ అడ్వకేట్‌గా నమోదు అయి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా నియామకం జరుపుతారు.
పేపర్-1: 200 మార్కులకు ఆబెక్టివ్ పేపర్ ఉంటుంది. ఇందులో నెగటివ్ మార్కింగ్ ఉంది. పేపర్-2 రెండు వందల మార్కులకు డిస్ర్కిప్టివ్ పేపర్ ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
దరఖాస్తులు ప్రారంభం: 2025 సెప్టెంబర్ 12
దరఖాస్తుకు చివరి తేదీ: 2025 అక్టోబర్ 5
వెబ్‌సైట్: WWW.TGPRB.in
Updated Date - Sep 08 , 2025 | 06:15 AM