ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Paramedical Courses: వైద్య రంగానికి వారధి పారా మెడికల్‌

ABN, Publish Date - Jun 23 , 2025 | 05:09 AM

ప్రస్తుత కాలంలో వైద్యుడితో పాటు వైద్య సహాయకుడి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. అయితే ఆ సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బంది తగినంతమంది ప్రస్తుతం లేరు. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని...

వైద్య రంగం అంటే డాక్టర్లు, నర్సులు,ఫార్మసిస్టులు మాత్రమే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఆ తరవాత కొంచెం ఎక్కువ తెలిసిన వారికి కూడా ఏ ఫిజియోనో లేకుంటే ఒకటీ అర టెక్నీషియన్‌ మాత్రమే తెలుస్తారు. అయితే ఆస్పత్రి లేదా క్లినిక్‌కు అనుబంధంగా చాలా మంది పనిచేస్తుంటారు. ఇందులో చాలా కెరీర్‌లు ఉంటాయి. వైద్య రంగంలోకి వెళ్లాలనుకుని ఎంబీబీఎస్‌లో సీటు రాని వారు ఇలాంటి కోర్సుల్లో చేరి తమ అభిరుచిని పూర్తిచేసుకోవచ్చు. కెరీర్‌లో స్థిరపడవచ్చు. అంతేకాదు ఎప్పటికీ రిసెషన్‌ అనేది దరి చేరని రంగం ఇది.

ప్రస్తుత కాలంలో వైద్యుడితో పాటు వైద్య సహాయకుడి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. అయితే ఆ సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బంది తగినంతమంది ప్రస్తుతం లేరు. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం డిగ్రీ స్థాయిలో బీఎస్సీ పారా మెడికల్‌ కోర్సులను నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలతోపాటు, కిమ్స్‌, ఎస్వీఎస్‌ వంటి ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో ఈ కోర్సులు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌, కాకినాడ, గుంటూరు, కర్నూలు వంటి ప్రభుత్వ కాలేజీలతోపాటు బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ వంటి పారామెడికల్‌ కళాశాలల్లో ఈ కోర్సులు ఉన్నాయి. పారామెడికల్‌ కోర్సులు చేసిన వెంటనే విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటుతోపాటు, విదేశాల్లో కూడా ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయి. బైపీసీతో ఇంటర్‌ పూర్తి చేసిన వారు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. అన్ని పారా మెడికల్‌ కోర్సుల కాల వ్యవధి దాదాపుగా నాలుగు సంవత్సరాలే. వైద్య రంగంలో ఎంతో ప్రాముఖ్యం సంపాదించుకున్న ఈ కోర్సులు ఏమిటో చూద్దాం.

బీఎస్సీ ఆప్తోమెట్రిక్‌ టెక్నాలజీ: సర్వేంద్రియానాం నయనం ప్రధానం. కళ్లకు అనుకోనిది ఏమైనా జరిగితే జీవితం అంధకారం అవుతుంది. మానవ శరీరంలో అంతటి ప్రాధాన్యం కలిగిన కళ్లకు చికిత్స అందించడంలో సహాయపడేదే బీఎస్సీ ఆప్తోమెట్రిక్‌ టెక్నాలజీ. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఆస్పత్రుల్లో ఆప్తోమెట్రిస్ట్‌గా ఉద్యోగాలు పొందవచ్చు. అనుభవం సంపాదించుకున్న తరవాత ఆప్తోమెట్రి టెక్నీషియన్స్‌గా స్థిరపడవచ్చు.

బీఎస్సీ కార్డియాక్‌ కేర్‌ టెక్నాలజీ అండ్‌ కార్డియో వాస్కులర్‌ టెక్నాలజీ: మానవ శరీరంలో గుండె ప్రధానమైనది. గుండె సంబంధిత, రక్తనాళాల పనితీరు వాటిపై ఈ కోర్సులో బోధిస్తారు. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, పేస్‌ మేకర్‌, స్టంట్స్‌ అమరిక వంటి వాటిల్లో ఈ నిపుణుల పాత్ర ఎంతో కీలకం. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఆసుపత్రుల్లో ఓటీ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించవచ్చు. తగిన అనుభవంతో కార్డియాలజీ టెక్నీషియన్స్‌, క్యాత్‌ ల్యాబ్‌ విభాగంలో ఉద్యోగులుగా స్థిరపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(బీపీటీ): ఏదైనా ప్రమాదాలు లేదా వృద్థాప్యంతో శరీర భాగాల కదలికల్లో ఇబ్బందులు ఏర్పడితే వాటికి ఫిజియోథెరపి ద్వారా చికిత్స అందిస్తారు. ఎముకలు విరిగినా, పక్కకు జరిగినా, దెబ్బలు తగిలినా ఈ చికిత్స ద్వారా సరి చేయవచ్చు. మానవ శరీరంలో వివిధ భాగాలు, వాటి అమరిక తదితర విషయాలను ఈ కోర్సులో బోధిస్తారు. ఫిజియోథెరపిస్టులకు మంచి డిమాండ్‌ ఉంది. సొంతంగా క్లినిక్‌ నిర్వహించుకోవచ్చు.

బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ (ఎంఎల్‌టీ): ఎవరైనా ఏ వ్యాధితో బాధపడుతున్నారో అందుకు గల కారణాలను తెలిపేవారే మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌. వ్యాధి నిర్థారణ పరీక్షల్లో వీరు కీలక పాత్ర వహిస్తారు. ఈ కోర్సులో వ్యాధుల నిర్థారణ, సమాచార సేకరణ, శాంపిల్స్‌ సేకరణ తదితర అంశాలు నేర్చుకుంటారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారు మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌గా స్థిరపడవచ్చు. ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు అపారం.

బీఎస్సీ రెనాల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ: రక్తాన్ని శుద్థి చేయడం కిడ్నీల విధి. వీటి పనితీరులో ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ వ్యక్తికి డయాలసిస్‌ చేయాల్సి ఉంటుంది. మన దేశంలో చాలామంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. వీరందరికీ డయాలసిస్‌ అవసరం పడుతోంది. ఈ చికిత్సను నిపుణులైన వారి పర్యవేక్షణలోనే చేయాలి. దీంతో వీరికి ఎంతో డిమాండ్‌ ఉంది. ఈ కోర్సు చేసిన వారు డయాగ్నసిస్టులుగా డయాలసిస్‌ సెంటర్లు, ఆస్పత్రుల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. సొంతంగా ల్యాబ్‌లు నిర్వహించవచ్చు.

బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ: నరాల సంబంధిత వ్యాధుల చికిత్స, రోగి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలు ఈ కోర్సులో భాగం. నరాలు, కండరాల పనితీరును కూడా బోధిస్తారు. ఈ కోర్సు చదివిన వారు ఆసుపత్రుల్లో న్యూరో సర్జన్స్‌, న్యూరో ఫిజిషియన్స్‌, న్యూరాలజిస్టులకు సహాయకులుగా సేవలు అందించవచ్చు. సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు.

బీఎస్సీ రెస్పిరేటరీ థెరపి టెక్నాలజీ: ఇది రెస్పిరేటరీ, కార్డియో పల్మనరీ డిజార్డర్స్‌ ఉన్న రోగులను అంచనా వేయడం, చికిత్స చేయడంలో విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు రూపొందించిన ప్రోగ్రామ్‌. శ్వాసకోశ అనాటమి, పల్మనరీ ఫంక్షన్‌ టెస్టింగ్‌, మెకానికల్‌ వెంటిలేషన్‌, క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలను కవర్‌ చేస్తుంది. రెస్పిరేటరీ థెరపి్‌స్టలకు డిమాండ్‌ బాగా ఉంటుంది. ఈ గ్రాడ్యుయేట్లు ఆస్పత్రులు, పునరావాస కేంద్రాలు, ఔట్‌ పేషెంట్‌ క్లినిక్‌లతో సహా వివిధ ఆరోగ్య సంరక్షణ సెట్టింగ్‌లలో పని చేయవచ్చు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు.

బీఎస్సీ ట్రాన్స్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ: బీఎస్సీ ట్రాన్స్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ అనేది బ్లడ్‌ బ్యాంక్‌లు, ఆస్పత్రులు, రీసెర్చ్‌ ల్యాబ్‌లు, ఇతర హెల్త్‌కేర్‌ సెంటర్స్‌లలో పని చేయడానికి అవసరమైన అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు.

ఇందులో బ్లడ్‌ టెక్నాలజీ, క్లినికల్‌ ప్రాక్టీసెస్‌, సేఫ్టీ ప్రోటోకాల్స్‌, బ్లడ్‌ గ్రూప్‌ సెరోలజీ, బ్లడ్‌ కాంపోనెంట్‌ సెపరేషన్‌, క్వాలిటీ కంట్రోల్‌, ట్రాన్స్‌ఫ్యూజన్‌ విధానాలను వివరిస్తారు.

ఈ గ్రాడ్యుయేట్లు రక్తనిధి కేంద్రాలు, రక్తమార్పిడి కేంద్రాలు, రక్తమార్పిడి సేవలతో ఉండే ఆస్పత్రులు, క్లినిక్‌లలో పనిచేయవచ్చు. అలాగే హెమటాలజీ, రక్త సంబంధిత అధ్యయనాలపై దృష్టి సారించే పరిశోధన ప్రయోగశాలల్లో, రక్త సేకరణ కేంద్రాల్లో పనిచేయవచ్చు.

బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్‌ టెక్నాలజీ: క్లిష్టమైన వైద్య పరిస్థితులలో విద్యార్థులను సన్నద్థం చేయడానికి రూపొందించిన ఒక ప్రత్యేక అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌. అత్యవసర సంరక్షణ పద్థతులు, గాయాన్ని ట్రీట్‌ చేయడం, ఆస్పత్రుల్లో రోగి పర్యవేక్షణపై దృష్టి పెడుతుంది.

బీఎస్సీ అనస్థీషియా అండ్‌ ఆపరేషన్‌ టెక్నాలజీ: రోగికి శస్త్ర చికిత్స సమయంలో మత్తుమందు ఎంతో అవసరం. అందుకు ప్రత్యేకమైన నిపుణులు కావాలి. రోగికి ఎంత మోతాదులో మత్తు మందు ఇవ్వాలి అనే విషయంలో వీరు కూడా పాలు పంచుకుంటారు. ఓ సర్వే ప్రకారం మన దేశంలో లక్ష మందికి ఒక మత్తుమందు వైద్యుడు ఉన్నారు. కాబట్టి ఈ నిపుణులకు మంచి అవకాశాలు ఉంటాయి.

ఆపరేషన్‌ టెక్నాలజీ: శస్త్రచికిత్స సమయంలో ఎంతో ప్రాధాన్యం కలిగింది. శస్త్ర చికిత్సకు అవసరమయ్యే సరంజామాను వీరే నిర్ణయించాల్సి ఉంటుంది. రోగిని ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకురావడం నుంచి తిరిగి తీసుకెళ్లేవరకు వీరి పాత్ర కీలకం. ఈ కోర్సు చేసిన వారు ఆసుపత్రుల్లో ఓటీ టెక్నీషియన్స్‌గా, వైద్యులకు సహాయకులుగా ఉద్యోగావకాశాలు పొందవచ్చు. అనుభవం సంపాదించుకున్న తరవాత ఎనస్థీషియా టెక్నీషియన్స్‌గా సొంతంగా స్థిరపడవచ్చు.

బీఎస్సీ ఇమేజింగ్‌ టెక్నాలజీ: మానవ శరీరంలో రోగ నిర్థారణలో ఇదిప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది చదివిన వారు ఎక్స్‌ రే టెక్నీషియన్స్‌, ఎంఆర్‌ఐ, సిటీ స్కానర్స్‌గా ఆస్పత్రుల్లో ఉద్యోగాలు పొందవచ్చు. సొంతంగా ల్యాబ్‌లు పెట్టుకోవచ్చు. డయాగ్నస్టిక్‌ సెంటర్స్‌లో స్థిరపడవచ్చు.

బీఎస్సీ రేడియోథెరపి టెక్నాలజీ: రేడియోథెరపీ టెక్నాలజీ రంగం బహుముఖంగా ఉంటుంది. ఈ రంగంలోని అన్ని అంశాలపై సమగ్రమైన కోర్సులు ఉన్నాయి. మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకునే వారికి, పిహెచ్‌డిపై ఆసక్తి ఉన్నవారికి ఈ బ్యాచిలర్‌ డిగ్రీ అవసరం.

  • గ్రాడ్యుయేషన్‌ తరవాత అధునాతన డిగ్రీలను ఎంచుకోవచ్చు. మెడికల్‌ ఇమేజింగ్‌ సాంకేతిక నిపుణులు, రేడియేషన్‌ థెరపిస్ట్‌లు లేదా చర్మవ్యాధి నిపుణులు కూడా కావచ్చు. రేడియేషన్‌ థెరపిస్ట్‌, రేడియేషన్‌ ఆంకాలజీ సాంకేతిక నిపుణుడు, మెడికల్‌ డోసిమెట్రిస్ట్‌, సీనియర్‌ టెక్నాలజిస్ట్‌గా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యరంగంలో స్థిరపడవచ్చు.

Updated Date - Jun 23 , 2025 | 05:27 AM