JAM Notification Released: జామ్ 2026
ABN, Publish Date - Aug 25 , 2025 | 04:20 AM
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ 2026 నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న..
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్’(జామ్-2026) నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 22 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ(టెక్నాలజీ), ఎంఎస్ రిసెర్చ్, ఎంఎస్సీ ఎంటెక్, జాయింట్ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ(డ్యూయల్ డిగ్రీ) కోర్సులో అడ్మిషన్లు జరుపుతారు. ఈసారి ఎంట్రెన్స్‌ను ఐఐటీ బాంబే నిర్వహించనుంది. 2025 సెప్టెంబరు 5 నుంచి దరఖాస్తులు దాఖలు చేయవచ్చు. ఎంట్రెన్స్2026 ఫిబ్రవరి 15న జరుగుతుంది. ఫలితాలు మార్చి 18న వెలువడుతాయి.
అర్హత: నిర్దేశిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులే.
సబ్జెక్టులు: బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మేథ్స్, మేథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి
దరఖాస్తులకు తుది గడువు: 2025 అక్టోబర్ 12 వెబ్‌సైట్: https://jam2026.iitb.ac.in
Updated Date - Aug 25 , 2025 | 04:20 AM