IBPS Notification 2025: గ్రామీణ బ్యాంకుల్లో పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్
ABN, Publish Date - Sep 08 , 2025 | 06:31 AM
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్, ఆఫీసర్ల నియామకాల కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్, ఆఫీసర్ల నియామకాల కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎ్‌స) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 13,217 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో తెలంగాణలో 798 పోస్టులు(450 ఆఫీస్ అసిస్టెంట్లు, 348 ఆఫీసర్లు), ఏపీలో 152(150 ఆఫీస్ అసిస్టెంట్, 2 ఆఫీసర్) పోస్టులు ఉన్నాయి.
వయస్సు: ఆఫీస్ అసిస్టెంట్‌కు 18-25 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్-1కు 18-30 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్-2కు 21-32 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్-1కు 21-40 ఏళ్లు ఉండాలి. సరైన కటాఫ్ డేట్స్ కోసం నోటిఫికేషన్ చూడవచ్చు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ(కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ లేదు) ద్వారా ఎంపిక జరుగుతుంది. మల్టీ పర్పస్ అసిప్టెంట్ ప్రిలిమినరీ పరీక్షలో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీపై 80 మార్కులకు, 80 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 45 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 80 మార్కులకు, 80 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 45 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్‌లో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ తదితరాలపై ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష: 2025 నవంబర్/డిసెంబర్‌లో ప్రిలిమ్స్, 2025 డిసెంబర్/2006 జనవరిలో మెయిన్స్ ఉంటుంది.
చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 29
వెబ్‌సైట్: https//ibps.in/
Updated Date - Sep 08 , 2025 | 06:36 AM