ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Film Courses: పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్స్‌

ABN, Publish Date - Jun 23 , 2025 | 04:56 AM

ఫుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఎల్‌) నుంచి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(ఎంఎఫ్ఏ), ఏడాది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సరిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది.

ఫుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఎల్‌) నుంచి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(ఎంఎఫ్ఏ), ఏడాది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సరిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. టీవీ, సినిమా రంగాల్లో పనిచేయడానికి ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దర్శకత్వం, స్ర్కీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, స్ర్కీన్‌ రైటింగ్‌, ఎడిటింగ్‌, సౌండ్‌ రికార్డింగ్‌ ఇలా పలు రంగాలకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఎంట్రెన్స్‌ పరీక్ష ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు.

ఫిల్మ్‌ వింగ్‌(ఎంఎఫ్ఏ - మాస్టర్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్‌)

కోర్సులు - సీట్లు

  • డైరెక్షన్‌ అండ్‌ స్ర్కీన్‌ప్లే రైటింగ్‌ - 11 సీట్లు

  • సినిమాటోగ్రఫీ - 11 సీట్లు

  • ఎడిటింగ్‌ - 11 సీట్లు

  • సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌ - 11 సీట్లు

  • ఆర్ట్‌ డైరెక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ - 11 సీట్లు

  • స్క్రీన్ యాక్టింగ్‌ - 16 సీట్లు

  • స్క్రీన్ రైటింగ్‌ (ఫిల్మ్‌, టీవీ అండ్‌ వెబ్‌ సిరీస్‌) - 16 సీట్లు

టెలివిజన్‌ వింగ్‌(ఏడాది పీజీ సర్టిఫికెట్‌ కోర్సు)

కోర్సులు - సీట్లు

  • టీవీ డైరెక్షన్‌ - 11 సీట్లు

  • ఎలక్ట్రానిక్‌ సినిమాటోగ్రఫీ - 11 సీట్లు

  • వీడియో ఎడిటింగ్‌ - 11 సీట్లు

  • సౌండ్‌ అండ్‌ టీవీ ఇంజనీరింగ్‌ - 11 సీట్లు

అర్హత

ఎంఎఫ్ఏ కోర్సులు: గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. ఆర్ట్‌ డిజైన్‌ కోర్సుకు ఫైన్‌ ఆర్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ తప్పనిసరి.

ఏడాది పీజీ కోర్సులు: గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు: గరిష్ఠ వయోపరిమితి లేదు. అయితే ప్రవేశ సమయానికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1500/-. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.500/-, రెండు కోర్సులకు దరఖాస్తు చేస్తే రూ.2500/-, రూ.800/- చెల్లించాలి.

పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడలో సెంటర్లు ఉన్నాయి.

దరఖాస్తుకు చివరి తేదీ: 2025 జూలై 11

ప్రవేశ పరీక్ష: 2025 జూలై 27

వెబ్‌సైట్‌:https://ftii.ac.in/announcement

Updated Date - Jun 23 , 2025 | 05:07 AM