CA Course: సీఏ ఎవర్ గ్రీన్ కోర్సు
ABN, Publish Date - Aug 25 , 2025 | 04:34 AM
ఒకప్పుడు ఆర్ట్స్, కామర్స్ గ్రూపుల విద్యార్థులంటే చిన్న చూపు ఉండేది. చార్టర్డ్ అకౌంటెన్సీ సీఏ లాంటి ప్రొఫెషన్స్ పాపులర్ అయ్యాక పరిస్థితి మారింది. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న సీఏల సంఖ్య కేవలం నాలుగు ..
ఒకప్పుడు ఆర్ట్స్, కామర్స్ గ్రూపుల విద్యార్థులంటే చిన్న చూపు ఉండేది. చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) లాంటి ప్రొఫెషన్స్ పాపులర్ అయ్యాక పరిస్థితి మారింది. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న సీఏల సంఖ్య కేవలం నాలుగు లక్షలు. 2050 నాటికి మన దేశానికి 50 లక్షల మంది సీఏలు అవసరం అని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ ప్రెసిడెంట్ చరణ్ జోత్ సింగ్ నంద ఇటీవలే ఒక మీడియా సమావేశంలో తెలిపారు. అంటే రాబోయే రోజుల్లో ఈ కోర్సుకు డిమాండ్ ఎలా ఉంటుందో అర్థం అవుతోంది. పాతికేళ్లుగా మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు విదేశాల్లో ఎలా విజయం సాధిస్తున్నారో, అదేమాదిరిగా భవిష్యత్తులో చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా మారే అవకాశం ఉంది. ఇంజనీరింగ్, మెడిసిన్‌తో పోలిస్తే ఈ కోర్సుకయ్యే ఖర్చు తక్కువ. ఉద్యోగం గ్యారంటీ. మారుతున్న అవసరాలు, మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా ఈ కోర్సులో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి.
ఇటీవలి మార్పులు...
గతంలో సీఏ ఇంటర్, ఫైనల్‌లో 8 పేపర్లు ఉంటే ఇప్పుడు అవి 6కి తగ్గాయి. విద్యార్థులు తరచూ ఫెయిల్ అయ్యే పేపర్లు తీసేశారు. ఒక ఎలక్టివ్ పేపర్‌ను జత చేశారు.
ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలు గతంలో సంవత్సరానికి రెండు సార్లు జరిపితే ఇప్పుడు ఏటా మూడు సార్లు నిర్వహిస్తున్నారు.
అలాగే సీఏ ఫైనల్ చేస్తూ మూడు సంవత్సరాల పాటు ఆర్టికల్‌షి్‌ప(ప్రాక్ట్టికల్ ట్రైనింగ్) చేయాల్సి వచ్చేది. కొత్త విధానంలో ఇది రెండు సంవత్సరాలు మాత్రమే.
కమ్యూనికేషన్ స్కిల్స్‌కి పెద్దపీట
సీఏ కోర్సులోని మొదటి దశ సీఏ-సీపీటీస్థానంలో ఇప్పుడు సీఏ ఫౌండేషన్ చేరింది. పాత సీపీటీలో పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో, నెగెటివ్ మార్కింగ్‌లతో ఉండేది. కొత్త విధానంలో 50 శాతం ప్రశ్నలు వ్యాసరూపంలో, 50 శాతం ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఇవ్వనున్నారు. అంటే మొత్తం 4 పేపర్లలో 2 పేపర్లు డిస్ర్కిప్టివ్ పేపర్లు. దీంతో నెగెటివ్ మార్కులకు అవకాశం లేదు.
అలాగే సీపీటీ విధానం ఉన్నప్పుడు అందులోని నాలుగు పేపర్లకు ఒకేరోజు పరీక్ష నిర్వహించేవారు. కానీ కొత్త విధానంలో ఫౌండేషన్‌లోని 4 పేపర్లను నాలుగు రోజులు(ఒక్కోరోజు ఒక్కోపేపర్) పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా పరీక్ష రాసే అవకాశం ఏర్పడింది. అలాగే ‘ఆర్టికల్‌షి్‌ప’(ప్రాక్టికల్ ట్రైనింగ్)లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఒకప్పుడు ఐపీసీసీలో(ఇప్పటి సీఏ ఇంటర్మీడియట్) రెండు గ్రూపులు(లేదా) కనీసం మొదటి గ్రూపు పాస్ అయిన వారికే ఆర్టికల్‌షిప్‌కి అవకాశం ఉండేది. ఇప్పుడు సీఏ ఇంటర్‌లో రెండు గ్రూపులు పూర్తి చేసిన వారికి మాత్రమే ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో చేరే అవకాశం కల్పించారు.
మొదటి దశ ఫౌండేషన్
సీఏ ఫౌండేషన్ పరీక్ష సంవత్సరానికి మూడుసార్లు జనవరి, మే, సెప్టెంబర్) నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 9,000/-. ఈ ఫౌండేషన్ పరీక్ష మే నెలలో రాయాలనుకుంటే అదే సంవత్సరం జనవరి 1లోగా, సెప్టెంబరులో రాయాలనుకుంటే అదే సంవత్సరం మే 1లోగా నమోదు చేయించుకోవాలి. ఇక జనవరిలో రాయాలనుకుంటే ముందు సంవత్సరం సెప్టెంబరు 1లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇంటర్మీడియట్(లేదా), 10+2(లేదా) అందుకు సమానమైన పరీక్ష రాసిన వారు ఫౌండేషన్ కోర్సుకి నమోదు చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న నాలుగు నెలలకు ఫౌండేషన్ పరీక్ష రాయవచ్చు.
ఇప్పటి సీఏ ఫౌండేషన్ స్థానంలో గతంలో నిర్వహించిన సీపీటీ పరీక్ష మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలోనే ఉండేది. కానీ, ప్రస్తుత ఫౌండేషన్ పరీక్షలో 50 శాతం మార్కులను డిస్ర్కిప్టివ్ పరీక్షగా, మరో 50 శాతం మార్కులను మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలుగా పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలన్న విద్యార్థి ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి అలాగే 4 పేపర్లు కలిపి 400 మార్కులకు గాను 50 శాతం మార్కులు అంటే 200 మార్కులు సాధించాలి.
రెండో దశ ఇంటర్
సీఏ ఫౌండేషన్ పూర్తి చేసినవారు ఇంటర్ చదవడానికి అర్హులు. గ్రాడ్యుయేట్లు/ సీఎంఏ ఇంటర్/ సీఎస్ ఇంటర్ పూర్తి చేసిన వారు ఫౌండేషన్‌తో సంబంధం లేకుండా నేరుగా సీఏ ఇంటర్ పరీక్ష రాయవచ్చు. సీఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 18,000/-. ఈ పరీక్షని మే నెలలో రాయాలనుకుంటే ముందు సంవత్సరం సెప్టెంబరు 1లోగా, సెప్టెంబరులో రాయాలనుకుంటే అదే సంవత్సరం జనవరి 1లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. జనవరిలో రాయాలనుకుంటే ముందు సంవత్సరం మే 1లోగా నమోదు చేయించుకోవాలి.
డిగ్రీ అర్హతతో: డిగ్రీ అభ్యర్థులు ఫౌండేషన్‌తో సంబంధం లేకుండా నేరుగా సీఏ ఇంటర్‌కు నమోదు చేయించుకోవచ్చు. కామర్స్ యూజీ/పీజీ అయితే 55శాతం మార్కులు, ఇతర డిగ్రీ/ పీజీ అయితే 60శాతం మార్కులు ఉండాలి. అయితే వీరు సీఏ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే నాలుగు వారాల ఐసీఐటీఎ్‌సఎ్‌స(ఇంటిగ్రేటెడ్ కోర్సు ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్స్) శిక్షణ తరగతులకు హాజరు కావాలి. దీని తరవాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రారంభించాలి. 8 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేసిన వారే సీఏ ఇంటర్ పరీక్షకు అర్హులు.
ఇంటర్‌లోని 6 పేపర్లను 2 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 3 పేపర్లు ఉంటాయి. ఒక్కోక్క పేపరు 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్ పాస్ కావాలంటే ప్రతి పేపరులో 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తం మీద 50 శాతం మార్కులు రావాలి. సీఏ ఇంటర్ రెండు గ్రూపులూ పూర్తి చేసిన వారు రెండు ఏళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి.
ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఆర్టికల్‌షిప్): సీఏ ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను గతంలో ఆర్టికల్‌షిప్ అని పిలిచేవారు. గతంలో ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఆర్టికల్‌షిప్) మూడు సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు దానిని రెండు సంవత్సరాలకు తగ్గించారు.
సీఏ ఇంటర్ రెండు గ్రూపులూ పూర్తి చేసిన వారు ఇన్‌స్టిట్యూట్ వారి 4 వారాల ఏఐసీఐటీఎ్‌సఎ్‌స(అడ్వాన్స్‌డ్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్స్) శిక్షణ కూడా తీసుకోవాలి. వీరికి ఉపకారవేతనం లభించే అవకాశం ఉంది.
మూడో దశ ఫైనల్
సీఏ ఇంటర్ తదుపరి రెండు సంవత్సరాల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేసిన వారు సీఏ ఫైనల్‌కు నమోదు(రిజిరేస్టషన్) చేయించుకొవచ్చు. దీని రిజిరేస్టషన్ ఫీజు 22,000/-. ఫైనల్ నమోదుకి తుది గడువు అంటూ ఏమీలేదు. ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తికాబోతున్న సమయంలో ఫైనల్‌కి నమోదు కావచ్చు. అంటే ఫైనల్ పరీక్షకు దరఖాస్తు చేసేలోగా రిజిస్ట్రేషన్ పూర్తి కావాలి. ఫైనల్ పరీక్షను కూడా సంవత్సరానికి మూడు సార్లు అంటే జనవరి, మే, సెప్టెంబరు నెలల్లో నిర్వహిస్తారు.
ఈ పరీక్ష మొత్తం 6 పేపర్లు. 2 గ్రూపులుగా(గ్రూపుకి 3 పేపర్ల చొప్పున) ఒక్కోక్క పేపర్ 100 మార్కులకు మొత్తం 600 మార్కులకి ఉంటుంది. విద్యార్థి వీలును బట్టి 6 పేపర్లు ఒకేసారి లేదా ఒక్కో గ్రూపు విడివిడిగా రాసుకోవచ్చు.
ఇందులో పాస్ కావాలంటే ప్రతి పేపరులో 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తం మీద 50 శాతం మార్కులు రావాలి.
రిజస్ర్టేషన్ కోసం: www.icai.org/post/studentsservices లేదా 98851250001, 98851250003 హెల్ప్ లైన్ నెంబర్లని సంప్రదించవచ్చు.
ప్రకాశ్ డైరెక్టర్, మాస్టర్ మైండ్స్
Updated Date - Aug 25 , 2025 | 04:34 AM