Engineering Admissions: సీఎస్ఈలో 5,261.. కోర్‌లో 6,075
ABN, Publish Date - Aug 11 , 2025 | 05:37 AM
ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్ తుది విడత కౌన్సెలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు రెండు విడతలు పూర్తి కాగా తాజాగా చివరి విడత కౌన్సెలింగ్ కూడా పూర్తవడంతో అర్హులైన అభ్యర్థులకు
తుది విడత కౌన్సెలింగ్ తర్వాత బీటెక్‌లో మిగిలిన సీట్లు
భర్తీ కాని సీట్లు 11,638.. 18, 19న ఇంటర్నల్ స్లైడింగ్
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్ తుది విడత కౌన్సెలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు రెండు విడతలు పూర్తి కాగా తాజాగా చివరి విడత కౌన్సెలింగ్ కూడా పూర్తవడంతో అర్హులైన అభ్యర్థులకు ఆదివారం సీట్లు కేటాయుంచారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 180 ఇంజనీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 91,649 సీట్లు అందుబాటులో ఉండగా.. తుది విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక 80,011 (87.3ు) సీట్లు భర్తీ అయ్యాయి. 11,638 సీట్లు మిగిలాయి. మిగిలిన మొత్తం సీట్లలో కంప్యూటర్ సైన్స్ (సీఎ్‌సఈ) అనుబంధంగా ఉన్న 19 బ్రాంచిల్లో 5,261 సీట్లున్నాయి. సీఎ్‌సఈలో అత్యధికంగా 30,678 సీట్లుండగా 28,787 (93.84ు) భర్తీ అయి 1,891 మిగిలిపోయాయి. సీఎ్‌సఈ ఏఐ, ఎంఎల్ 15,189 సీట్లలో 14,167 (93.27ు) సీట్లు భర్తీకాగా 1,022 సీట్లు మిగిలాయి. కోర్ ఇంజనీరింగ్‌లో సీట్ల భర్తీ ఈసారి గతంతో పోలిస్తే ఎక్కువగా ఉన్నప్పటికీ.. 6,075 సీట్లు భర్తీ కాలేదు. కళాశాల పరిధిలో ఇతర బ్రాంచిల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 18, 19న ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎప్‌సెట్ కన్వీనర్‌శ్రీదేవసేన తెలిపారు. తర్వాత స్పాట్‌కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
Updated Date - Aug 11 , 2025 | 05:37 AM