AI Courses in Swayam Portal: స్వయం పోర్టల్‌లో ఉచిత ఏఐ కోర్సులు.. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫర్..
ABN, Publish Date - Aug 16 , 2025 | 02:08 PM
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ది కీలక పాత్ర అని చెప్పక తప్పదు. ఏఐ కోర్సులు నేర్చుకున్ అప్‌డేట్ అవకపోతే ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. దీంతో చాలా మంది విద్యార్థులు ఏఐ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ది కీలక పాత్ర అని చెప్పక తప్పదు. ఏఐ కోర్సులు నేర్చుకుని అప్‌డేట్ అవకపోతే ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. దీంతో చాలా మంది విద్యార్థులు ఏఐ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు (Free AI Courses). ఈ నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖ ( Ministry Of Education) స్వయం పోర్టల్‌లో ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను అందిస్తోంది (AI Courses in Swayam Portal).
వివిధ పరిశ్రమలలో ఏఐ ప్రాముఖ్యం పెరుగుతున్నందున, ఈ కోర్సులు సాంకేతికత, ఆవిష్కరణ, పరిశోధనలలో భవిష్యత్తు కెరీర్‌లకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలను అందిస్తాయి. ఈ నేపథ్యంలో స్వయం పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఐదు ఉచిత ఏఐ కోర్సులు ఏంటో తెలుసుకుందాం.
1. AI/ML
ఈ కోర్సు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ నేర్పిస్తుంది. గణాంకాలు, లీనియర్ ఆల్జీబ్రా, ఆప్టిమైజేషన్, డేటా విజువలైజేషన్ పై దృష్టి పెడుతుంది. ఈ కోర్సు 36 గంటల పాటు కొనసాగుతుంది. చివరిలో సర్టిఫికేషన్ అసెస్‌మెంట్ ఉంటుంది.
2. AI తో క్రికెట్ విశ్లేషణ
ఈ కోర్సును మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్లు అందిస్తున్నారు. క్రికెట్‌ను ప్రాథమిక ఉదాహరణగా తీసుకుని ఏఐ ద్వారా విశ్లేషణ చేయడం నేర్పిస్తారు. ఈ కార్యక్రమం 25 గంటల పాటు కొనసాగుతుంది.
3. ఫిజిక్స్‌లో AI
వాస్తవ ప్రపంచ భౌతిక శాస్త్ర సమస్యలను మెషిన్ లెర్నింగ్, న్యూరల్ నెట్‌వర్క్‌లు ఎలా పరిష్కరించగలవో ఈ కోర్సు నేర్పుతుంది. ఇందులో ఇంటరాక్టివ్ సెషన్‌లు, హ్యాండ్స్
4. అకౌంటింగ్‌లో AI
వాణిజ్యం, నిర్వహణ సబ్జెక్టులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన కోర్సు ఇది. అకౌంటింగ్ పద్ధతుల్లో AIని ఎలా అన్వయించవచ్చో వివరిస్తుంది. 45 గంటల వ్యవధి గల కోర్సు ఇది.
5. కెమిస్ట్రీలో AI
వాస్తవ ప్రపంచ రసాయన డేటాసెట్‌లను ఉపయోగించి పరమాణు లక్షణాలు, మోడల్ రియాక్షన్స్, డిజైన్ డ్రగ్స్ మొదలైన వాటిని ఎలా అంచనా వేయాలో ఈ కోర్సు నేర్పుతుంది. ఐఐటీ మద్రాస్ అందించే ఈ కోర్సు 45 గంటల పాటు ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
JNTU: ఆ ఎంఓయూతో విద్యార్థులకు మేలే..
Engineering Admissions: సీఎస్ఈలో 5,261.. కోర్‌లో 6,075
Read Latest Educational News
Updated Date - Aug 16 , 2025 | 02:08 PM