BC Reservation: మాటల్లో మద్దతు..చేతల్లో మోసం!
ABN, Publish Date - Oct 18 , 2025 | 04:15 AM
తెలంగాణలో బీసీలు 42శాతం వాస్తవంలో 56శాతానికి పైగా ఉన్నప్పటికీ, వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులు, అవకాశాలు ఇప్పటికీ అగ్రకులాల..
తెలంగాణలో బీసీలు 42శాతం(వాస్తవంలో 56శాతానికి పైగా) ఉన్నప్పటికీ, వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులు, అవకాశాలు ఇప్పటికీ అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 ాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకుంటున్న ప్రధాన శక్తి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ద్వారా బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపేస్తూ, బీసీల సామాజిక విప్లవాన్ని కేంద్రం అణచివేస్తోంది. అసెంబ్లీలో బీసీ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం పాస్ చేసినా (రిజర్వేషన్లు 50శాతానికి మించరాదనే కారణంగా అనంతరం హైకోర్టులో గానీ, సుప్రీంకోర్టులో గానీ ఈ ప్రతిపాదనలు తిరస్కరణకు గురవుతాయని ముందే తెలిసి కూడా!) దాన్ని అమలు చేయకుండా ఉండటం రేవంత్‌రెడ్డి వైఫల్యమే. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేసింది. దీనిబట్టి చూస్తే ‘ఈ పాలకుల మాటల్లో మద్దతు, చేతల్లో మోసం’ అన్నమాట! బీసీలను వీరు కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే వాడుకుంటున్నారు. పరిశీలిస్తే... బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అన్నీ ఒక తాను ముక్కలే అని అర్థమవుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తమ పార్టీకి మనుగడ ఉండదని పాలకులు గ్రహించడం వల్లే నాడు తెలంగాణ ఏర్పడింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై మాస్ మూమెంట్‌ను నిర్మించాలి. ఇది విప్లవాత్మక ఉద్యమంగా మారాలి. బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకూ అసెంబ్లీ, రాజ్‌భవన్, రోడ్లు, రైళ్లు, బస్సులు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు... ఇలా అన్ని బంద్ పాటించాలి. ధర్నాలు, రాస్తారోకోలు, పికెటింగ్‌లు, ర్యాలీలు, నిరసనలు చేయాలి. ఈ బంద్‌లో కేవలం బీసీలే కాకుండా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఆడవాళ్లు, అగ్రకుల పేదలు, ఎంబీసీలు, సంచార జాతులు... అందరూ ఐక్యమై జనాభా దామాషా ప్రకారం తమ రిజర్వేషన్లు, హక్కుల కోసం పోరాడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాజకీయ ఒత్తిడిని తెచ్చేందుకు బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి. బీసీలు ఓటు శక్తిని ఉపయోగించి, ఎన్నికల్లో పాలకులను శిక్షించాలి. ఇది ఒక సామాజిక విప్లవ పోరాటంగా మారాలి. బీసీలు తమ హక్కుల కోసం పోరాడకపోతే, పాలకవర్గాలు ఎప్పటికీ ఆ అధికారాన్ని బహుజనులకు ఇవ్వవు. సాధించండి!
– పాపని నాగరాజు, కొంకల వెంకటనారాయణ
Updated Date - Oct 18 , 2025 | 04:15 AM