ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Guest Faculty Regulation: అతిథి ఆచార్యులపై అసత్య ప్రచారం

ABN, Publish Date - Jun 28 , 2025 | 03:25 AM

వర్సిటీల ప్రక్షాళన ఇలా మొదలుకావాలి! శీర్షికన జూన్‌ 13న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ వ్యాసానికి ఇది ప్రతిస్పందన. ఒక రెగ్యులర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కావడానికి అవసరమైన అర్హతల కంటే కూడా అతిథి ఆచార్యులుగా పనిచేయడానికి ఎక్కువ అంతర్జాతీయ అర్హతల్ని వ్యాసకర్త ప్రతిపాదించారు.

‘వర్సిటీల ప్రక్షాళన ఇలా మొదలుకావాలి!’ శీర్షికన జూన్‌ 13న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ వ్యాసానికి ఇది ప్రతిస్పందన. ఒక రెగ్యులర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కావడానికి అవసరమైన అర్హతల కంటే కూడా అతిథి ఆచార్యులుగా పనిచేయడానికి ఎక్కువ అంతర్జాతీయ అర్హతల్ని వ్యాసకర్త ప్రతిపాదించారు. విశ్వవిద్యాలయాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ వయస్సు ఎక్కువగా ఉండటానికి కారణం పీహెచ్‌డీ ప్రవేశాలు అకడమిక్‌ క్యాలండర్‌ ప్రకారం జరగకపోవడం. ప్రవేశాల నుంచి పీహెచ్‌డీ ప్రదానాల వరకు ఐదు, ఆరేళ్ళ కాలం పడుతోంది. ఆ తర్వాత రెండు నుంచి ఐదేళ్ళ వరకు పోస్ట్‌ డాక్టరల్‌ ఫెలోషిప్‌ చేసే అవకాశం ఉంది. దీంతో వీరి వయస్సు 40కి పైబడుతుంది. ఆ తర్వాత ఉద్యోగ ప్రకటనలు లేక టీచింగ్‌ వృత్తి మీద ఆసక్తితో ఏ గెస్ట్‌ ఫాకల్టీగానో చేరతారు. మరి కొంతమంది ప్రైవేటు కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చేరతారు. వాళ్ళు కూడా తిరిగి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తుంటారు. ఏభై శాతానికి పైగా గెస్ట్‌ ఫ్యాకల్టీ 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌లో క్వాలిఫై అయ్యారు.

అతిథి ఆచార్యులు వారు బోధించే సబెక్టును ఇంగ్లీషులో ఉపన్యసించగలరు. వారు పీజీ పరీక్షలు, థీసిస్‌, పరిశోధనా పత్రాలను ఇంగ్లీషులోనే ప్రచురించి పీహెచ్‌డీ పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్రుల ఆత్మగౌరవంలో నుంచి, ఆంధ్రుల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అవతరించింది. ఇంగ్లీషురాని ఎక్కువ దేశాల విద్యార్థులకు అతిథి ఆచార్యులే ఇంగ్లీషు నేర్పిస్తున్నారు. తరగతి గదిలో అతిథి అధ్యాపకులు కొంత సమయం ప్రాంతీయ భాషలో కూడా బోధన చేయాల్సి ఉంటుంది. జాతీయ విద్యావిధానం–2020 ప్రాదేశిక భాషల వినియోగాన్ని ఉన్నత విద్యలో ప్రోత్సహిస్తోంది. ఇది బహుభాషలను అభివృద్ధి చేసే ప్రభుత్వ నిర్ణయం. డాక్టర్‌ వినయ్‌కుమార్‌ విదేశీ విద్యార్థులకు సంబంధించి కొన్ని ఆరోపణలు చేశారు. అవి నిజం కాదు. విదేశీ విద్యార్థులు కాపీ చేయరు, చేసే వారి గురించి పట్టించుకోరు. వారి సొంత విషయాల మీద తప్ప ఇతర విషయాల మీద ఫిర్యాదు చేయరు. ఇక, గెస్ట్‌ ఫ్యాకల్టీ కాపీలు రాయిస్తున్నారనే విషయానికి రుజువుల్లేవు.

ఇంగ్లీషేతర భాషలు బోధించే అతిథి అధ్యాపకులు ఇంగ్లీషులో పాఠం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లీషులో పరిశోధనా పత్రాలు రాయాల్సిన అవసరం లేదు. జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ సబ్జెక్టులు బోధించే అతిథి అధ్యాపకులు స్థానిక విద్యార్థులకు తెలుగులో కూడా బోధించాలి. ఎందుకంటే కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల విద్యార్థులు 80 శాతం తెలుగు పత్రికల్లో, ఛానళ్లలో పనిచేస్తున్నారు. వీరికి పత్రికాభాష, ప్రసార మాధ్యమాల భాష తెలుగులోనే చెప్పాలి. అంతేగాక రిపోర్టింగ్‌, ఎడిటింగ్‌ విషయంలోనూ స్థానిక భాష నేర్పాల్సి ఉంటుంది. అవసరమైతే మాండలిక పదజాలం, జాతీయాలు, యాస గురించి చెప్పాల్సి ఉంటుంది. పీజీ, పీహెచ్‌డీ చేసే సమయంలో ప్రతి అతిథి ఆచార్యుడు చాలా విద్యాసంస్థల్ని, ప్రదేశాల్ని సందర్శిస్తారు. అలా సందర్శించకపోయినా శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, కృత్రిమమేథ ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఫోటోలు, వీడియోలు చూడొచ్చు. ఆయా విద్యాసంస్థల గురించి చదివి తెలుసుకోవచ్చు. ఇక, లక్షల రూపాయల్లో జీతాలు పొందే ఆచార్యులు విదేశాలు వెళ్ళి అంతర్జాతీయ సెమినార్లలో పత్రసమర్పణ చేస్తారు. అందుకు తగిన అధికారిక వెసులుబాటు, రాయితీలు కూడా ఉన్నాయి. నెలవారీ జీతాల్లేని అతిథి అధ్యాపకులు విదేశాలే కాదు, దేశీయంగా ఇతర నగరాలకి వెళ్ళి పత్రసమర్పణ చేయడం కూడా కష్టం.

ప్రజాస్వామ్య రాజకీయాల్లో అన్ని రంగాల్లో నాయకుల ప్రమేయం అనివార్యం. ప్రతిభావంతులకు అన్యాయం జరిగినప్పుడు రాజకీయ నాయకుల ప్రమేయంతోనే బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రమేయంతో శాశ్వత బదిలీలు జరిగితే అది నేరం అవుతుంది. తర్వాత ఈ నిర్ణయాలు న్యాయస్థానాలకు ఎక్కి, విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠ వీధిన పడుతుంది. ఈ కోవకు చెందినదే డాక్టర్‌ వినయ్‌కుమార్‌ బదిలీ కూడా. చరిత్రాత్మక ఎయిడెడ్‌ వ్యవస్థ రాజకీయకుట్రతోనే కుప్పకూలింది. అందుకే కూటమి ప్రభుత్వం ఆ తప్పిదాన్ని సరిచేసింది. అతిథి అధ్యాపకుల్లో వంద శాతం మందికీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అర్హతలు ఉన్నాయి. 80 శాతం మంది నెట్‌ పరీక్షలో అర్హత, పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టోరల్‌, పబ్లికేషన్లు ఉన్నాయి. మిగతావారికి కొంతమందికి నెట్‌ అర్హత, పీహెచ్‌డీ ఉన్నాయి. సేజ్‌, రౌట్లెడ్‌, స్ప్రింగర్‌ జర్నల్స్‌లో ప్రచురణలు విదేశాల్లో ప్రొఫెసర్లు కావడానికి అవసరం. యూజీసీ మార్గదర్శకాలు–2025ను అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు చేయడానికి యూజీసీ కేర్‌ జర్నల్స్‌ సరిపోతాయి.

కాబట్టి విశ్వవిద్యాలయాల్లో ప్రక్షాళన అతిథి అధ్యాపకులతో కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారుల్లో ప్రవేశించిన ఆచార్యులతోనే మొదలుపెట్టాలి. అప్పుడే విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల నియామకాలకు న్యాయస్థానాల్లో అడ్డంకులు తొలగుతాయి. అర్హతలు కలిగిన నిరుద్యోగులకు విశ్వవిద్యాలయాల్లో న్యాయం జరుగుతుంది.

- డాక్టర్‌ జీకేడీ ప్రసాదరావు

ఆంధ్ర విశ్వవిద్యాలయం

Updated Date - Jun 28 , 2025 | 03:27 AM