ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Podu Land Rights: పోడు హక్కుల గోడు తీరేదెన్నడు

ABN, Publish Date - Jul 30 , 2025 | 01:01 AM

వానాకాలం మొదలైందంటే చాలు, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు, అటవీ అధికారుల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. ఇటీవల ములుగు జిల్లాలోని రొయ్యూరులో గిరిజనుల గుడిసెల తొలగింపు...

వానాకాలం మొదలైందంటే చాలు, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు, అటవీ అధికారుల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. ఇటీవల ములుగు జిల్లాలోని రొయ్యూరులో గిరిజనుల గుడిసెల తొలగింపు, భద్రాద్రి జిల్లా ఇరవెండి గ్రామంలో పోడు సాగు చేస్తున్న మహిళా రైతులపై దాడి వంటి ఘటనలు ఎన్నో. అసలు ఈ పోడు భూముల సమస్యలకు పరిష్కారం లేదా? పోడు హక్కుల చట్టం ఏం చెబుతోంది? గిరిజనులకు అడవిపై ఉన్న హక్కులను గుర్తిస్తూ ‘అటవీ హక్కుల చట్టం- 2006’ను కేంద్రం రూపొందించింది. అటవీ భూముల్లో నివాసం, సాగు, పోడు భూములకు హక్కు పత్రాలు పొందడం వంటి పలు రకాల హక్కులను గిరిజనులకు ఈ చట్టం కల్పించింది. భూ హక్కు పత్రం పొందడానికి సంబంధించి ‘2005 నాటికి ఆ భూముల్లో కనీసం మూడు తరాలుగా (75 ఏళ్లుగా) ఆ గిరిజనులు పోడు సాగు చేస్తూ ఉండాలి. ఆ భూమి కూడా పదెకరాల లోపే ఉండాలి’ అనే నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలకు విరుద్ధంగా సాగు చేసే వారిపై అటవీ పోలీసు అధికారులు కేసులు నమోదు చేస్తారు. భూమి హక్కు పత్రం పొందినవారు ఆ భూమిని వారసత్వంగానే అనుభవించాలి తప్ప ఎటువంటి భూ బదలాయింపులు చేయకూడదు. పోడు భూముల హక్కుల గుర్తింపు విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి.

గతంలో పోడు రైతులకు క్లైమ్ నెంబర్లు, భూమి పట్టాలు ఇచ్చినా, హక్కు పత్రాలు మాత్రం ఇవ్వలేదు. దీంతో అలాంటి భూములను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుని, ఆయా ప్రదేశాల్లో మొక్కలు నాటుతున్నారు. భూమి ఒకచోట ఉంటే మరోచోట సర్వే నెంబర్లు చూపించడం, వేర్వేరు చోట్ల భూములు ఉన్నట్లు చూపించడం (భూమి ఒకచోట ఉంటేనే సర్వే చేయాలనే నిబంధన ఉంది) వంటి సమస్యలున్నాయి. కొందరు పోడు రైతులకు భూ హక్కు పత్రాలు ఇచ్చినా టైగర్ జోన్లు, కోల్ ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ఆ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. అలా భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. పోడు భూముల వివాదాల్లో గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. పోడు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. పోడు భూములు చేతులు మారకుండా చూడాలి. పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించాలి.

వాసం ఆనంద్ కుమార్

ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 01:01 AM