ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Temple Conflict: ఆలయం కోసం యుద్ధంలో సందేశం ఏమిటి

ABN, Publish Date - Jul 31 , 2025 | 05:55 AM

ఒక ప్రాచీన శివాలయం కోసం కాంబోడియా–థాయ్‌లాండ్‌ మధ్య ఘర్షణలు రేగడం వెనుక పనిచేసినదేమిటి? కొంత భూభాగంపై ఆధిపత్యం కంటే, తమ పూర్వీకుల మూలాలూ, ఆనవాళ్లకు...

ఒక ప్రాచీన శివాలయం కోసం కాంబోడియా–థాయ్‌లాండ్‌ మధ్య ఘర్షణలు రేగడం వెనుక పనిచేసినదేమిటి? కొంత భూభాగంపై ఆధిపత్యం కంటే, తమ పూర్వీకుల మూలాలూ, ఆనవాళ్లకు సంబంధించిన ఉద్వేగపూరితమైన అంశం ఇది. ఈ వైరం భూమి కోసం కాదు, సాంస్కృతిక వారసత్వం కోసం. మరి, దీని నుంచి మనం నేర్చుకోవాల్సినదీ, స్ఫూర్తి పొందాల్సినదీ ఏమీ లేదా? జైనం, బౌద్ధం, వీరశైవం భారతీయ సమాజాన్ని ప్రభావితం చేసి సర్వమానవ సమానత్వానికి బాటలేశాయి. మానవ సమాజపు ఉన్నతి ఎట్లా ఉండాలో బసవేశ్వరుడు వందలయేండ్ల కిందనే ఆచరించి చూపించారు. తన ప్రజామండపంలో మహిళలకూ సమాన అవకాశాలిచ్చారు. అట్టడుగు సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. జైనం ఉనికిలో ఉన్నప్పుడు అల్ప, స్వల్ప ప్రాణులకూ కష్టం, నష్టం కలిగించరాదనే భావనను నూరి పోసింది. బౌద్ధం మానవాళి జీవన గమనాన్నే మార్చి వేసి, ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులకు సరికొత్త భాష్యాన్ని చెప్పింది. బసవేశ్వరుడు, ఆ తర్వాత చాలామంది మార్గదర్శులు సమాజపు ఆలోచనా ధోరణిని మార్చి, సరికొత్త దారులు చూపించారు. అక్కమహాదేవి, అల్లమహాప్రభు, హరళయ్య, కక్కయ, వేమన, ఆదున్న ఇద్దాసు... ఇట్లా చాలామంది శివతాత్విక పునాది ఆధారంగా అందర్నీ ఏకం చేసేందుకు యత్నించారు, సఫలమయ్యారు. నాటి సామాజిక పరిస్థితుల కోణంలో చూసినప్పుడు వీరిది అతిపెద్ద సాహసం. వీరి బోధలు ఆ తర్వాత ఉత్పత్తి కులాల ప్రజల పనిపాటల్లో ప్రధాన భాగం అయ్యాయి. ఆలోచనలను, ఉత్పత్తిశక్తిని పెంచాయి. సరికొత్త సంస్కృతికి, ఉన్నతికి దారి చూపించాయి. పాల్కురికి, ధూర్జటి, శ్రీనాథుని రచనలన్నీ నాటి వీరశైవ ప్రభావంతోనే వచ్చాయి, నాటి సమాజాన్ని ప్రభావితం చేశాయి.

కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో శివాలయాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఈ ప్రజల జీవితాల్లో శివుడు ప్రధానం. కాలక్రమంలో వీరశైవ ప్రభావం ఎందుకు తగ్గిపోయిందో చారిత్రక, సాంస్కృతిక కోణాల్లో పరిశోధించాలి. కాయకమే కైలాసం అని చెప్పిన బసవేశ్వరుల జీవితసారం గురించి మనం ఎందుకు మర్చిపోయామో ఆలోచించాలి. ‘‘రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు’’ అని ప్రభువులనే సవాల్ చేసిన ధూర్జటి ఇచ్చిన చైతన్యం గురించీ తెలుసుకోవాలి. జన జీవితంలో పరుల కోసం జీవించాలనే తలంపును బలీయంగా తీసుకొచ్చింది వీరశైవమే. అంటే శివుని మార్గం. మరి, మనదైన ఉన్నతి సంస్కృతిని, సదాచారాన్ని సమాజం ఎందుకు మర్చిపోయింది? భక్తి భావన అంటే అందరూ బాగుండాలని, పరులకు మేలు చేయకపోయినా, కీడు తలంచొద్దనే. తత్వాల రూపంలో, గేయాల రూపంలో, పద్యాల రూపంలో, నాటకాల రూపంలో పూర్వీకులు బోధించిన ఇలాంటి పాఠాలను జీవితంలో ఆచరిస్తున్నామా? రెండు దేశాల మధ్య ఒక శివాలయం కోసం జరిగిన యుద్ధాన్ని మనం చూడాల్సింది వార్తగా కాదు. వీరశైవం బోధించిన సర్వమానవ సమానత్వాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ మనం అవలోకనం చేసుకోవాలి, ఆచరించాలి.

గోర్ల బుచ్చన్న

(జర్నలిస్టు)

ఇవి కూడా చదవండి

చనుబాలు అమ్మి లక్షలు సంపాదిస్తున్న మహిళ..

ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం.. ఏం జరిగిందో తెలిస్తే..

Updated Date - Jul 31 , 2025 | 05:55 AM