ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలుగు వద్దా సంస్కృతం ముద్దా

ABN, Publish Date - May 23 , 2025 | 05:41 AM

‘‘పలికెడిది ఇంటర్మీడియట్ బోర్డట... పలికించెడు వాడు...’’ ఎవరో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. 2008లోనే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ‘ప్రాచీన హోదా’ ప్రకటించింది. అట్లాంటి తెలుగు భాషపై కత్తి వేలాడదీస్తూ, సంస్కృతానికి రెడ్ కార్పెట్ పరుస్తూ...

‘‘పలికెడిది ఇంటర్మీడియట్ బోర్డట... పలికించెడు వాడు...’’ ఎవరో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. 2008లోనే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ‘ప్రాచీన హోదా’ ప్రకటించింది. అట్లాంటి తెలుగు భాషపై కత్తి వేలాడదీస్తూ, సంస్కృతానికి రెడ్ కార్పెట్ పరుస్తూ తెలంగాణ ఇంటర్ బోర్డు ఈ సంవత్సరం ఏప్రిల్ 8న ఒక సర్క్యులర్ విడుదల చేసింది. అది తెలుగు భాషాభిమానుల్లో కలకలం రేపింది. ఆ కలకలానికి జవాబుగా ‘ఇంటర్ మీడియట్ స్థాయిలో తెలుగు భాషకొచ్చిన నష్టం ఏమీ లేదని’ బోర్డు అధికారులు హామీ అయితే ఇచ్చారు కానీ, సదరు సర్క్యులర్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించలేదు. మహారాష్ట్రలో మరాఠీని బలహీనపరచే యత్నాలు, తమిళనాడు స్కూళ్లలో మళ్ళీ హిందీని రుద్దే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? తెలంగాణలో తెలుగుపై పరోక్ష యుద్ధానికి కారణమేమిటి? ఈ పరిణామాలన్నిటి వెనక వ్యూహం ఏదయినా ఉందా?

తెలుగు సాహిత్యంలో ఇప్పుడు అనువాద యుగం పరిఢవిల్లుతున్నది. ఒకప్పుడు శరత్, ప్రేమ్‌చంద్‌లు తెలుగువాళ్లేనా అనిపించేటట్లుగా బెంగాలీ నవలలను తెలుగీకరించేవారు. ఇప్పుడు దేశదేశాల సాహిత్యాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాలలో నిపుణుల పరిశోధనలను తెలుగులోకి అనువదించే ప్రక్రియ ప్రయోజనకరంగా సాగుతున్నది. పుంఖానుపుంఖాలుగా మలయాళీ, తమిళ్, ఇంగ్లీష్, హిందీ ఇంకా ఎన్నో భాషల నుంచి సినిమాలు, నాటకాలు డబ్బింగ్ అయి టీవీలలో ప్రదర్శితమవుతున్నాయి. ఇంటర్నెట్ రంగంలో తెలుగు భాష దూసుకుపోతున్నది. ఈ రకంగా తెలుగు యువత ఉపాధి రంగంలో లబ్ధి పొందుతున్న ఈ తరుణంలో ఇంటర్ విద్యాధికారులు తెలుగు భాషకు ప్రత్యామ్నాయంగా సంస్కృతాన్ని ప్రోత్సహించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?


స్థానిక, దేశీయ భాషలపై ఇది వ్యూహాత్మక దాడి. విభిన్న సాంస్కృతిక సంపదతో దేశంలో అనేక భాషలు అలరారుతున్నాయని వీటన్నింటికీ గుర్తింపు లభించాలన్న లక్ష్యంతో ఏడు దశాబ్దాల క్రితం భాషాప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టింది భారత ప్రభుత్వం. భాష ద్వారానే సాంస్కృతిక వికాసం వ్యక్తమవుతుందన్న శాస్త్రీయ భావనతో భాషకు విద్యావ్యవస్థలో సమున్నత స్థానం కల్పించారు విద్యారంగ నిపుణులు. ప్రభుత్వ పాలనలో ముఖ్య అంశం స్థానిక భాష. ఇంటర్మీడియెట్, ఆ పై చదివే విద్యార్థులలో అధిక సంఖ్యాకులు భవిష్యత్తులో ప్రభుత్వ యంత్రాంగంలో భాగమవుతారు. వారు సామాన్య ప్రజలతో సంబంధాలు కొనసాగించాలన్నా, ప్రజల వద్దకు పాలనా ఫలితాలను చేర్చాలన్నా స్థానిక భాష అతి ముఖ్యం. తెలంగాణ స్థానిక భాష అయిన తెలుగును కాదని, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా వ్యావహారిక భాషగా లేని సంస్కృతానికి పెద్దపీట వేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు సాహసించిందంటే ఇందులో మర్మం ఏమిటో ప్రజలకు తెలియాలి. దేశ వ్యవస్థను సమగ్రంగా అధ్యయనం చేసి, భారతదేశ భవిష్యత్తు తరగతి గదులలోనే నిర్మితమవుతుందని ప్రవచించిన కొఠారి, తదితర కమిషన్లు దేశీయ భాషలను ప్రోత్సహించాలని సిఫారసు చేశాయి. అలాగే హిందీ మాట్లాడే రాష్ట్రాలలో దక్షిణాదిలో మాట్లాడే భాషను ఒకదానిని పాఠ్యప్రణాళికలో భాగం చెయ్యాలని సూచించింది. భిన్నత్వంలో ఏకత్వం సాధించడం ఈ సూచన వెనక ఉన్న ఉద్దేశ్యం. అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలో సంస్కృతాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యం వెనక ఉన్న విద్యా పరమార్థం ఏమిటో విద్యాభిమానులకు తెలియజెప్పాల్సిన అవసరం, బాధ్యత ఇంటర్ బోర్డు అధికారులకు ఉంది. ఈ విషయంలో తెలంగాణ విద్యా కమిషన్ తన అభిప్రాయం ఏమిటో కూడా స్పష్టం చెయ్యాలి.


సంస్కృతంపై అమితమైన ప్రేమ ఉంటే, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాధికారులు ఆ పరీక్షను ఖచ్చితంగా దేవనాగరి లిపిలోనే రాయాలన్న నిబంధన ఎందుకు విధించరు? ఏ భాషలో పరీక్ష ఆ భాషలోనే రాయాలి, కానీ సంస్కృతం పరీక్ష మాత్రం తెలుగులో అయినా, ఇంగ్లీష్‌లో అయినా రాసుకోవచ్చట! ఇంతకంటే హాస్యాస్పదమైన నియమం ఇంకొకటి ఉండదు.

రాజేంద్రబాబు అర్విణి

పూర్వ అధ్యక్షుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం

ఇవీ చదవండి:

14 ఏళ్లకే ఇంత క్రేజా!

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 05:41 AM