ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎవరికి ఈ సంబురాలు

ABN, Publish Date - Jun 10 , 2025 | 03:44 AM

తెలంగాణ ఆవిర్భవించి పదకొండేళ్లు నిండాయి. కానీ ఉద్యమ కారుల జీవితాలేమాత్రం మారలేదు. వారి కోసం ప్రభుత్వాలు ఇప్పటి వరకూ చేసిందేమీ లేదు. వారి వల్లనేకదా ఈనాడు తెలంగాణకు చెందినవారు పాలకులై రాష్ట్రాన్ని...

తెలంగాణ ఆవిర్భవించి పదకొండేళ్లు నిండాయి. కానీ ఉద్యమ కారుల జీవితాలేమాత్రం మారలేదు. వారి కోసం ప్రభుత్వాలు ఇప్పటి వరకూ చేసిందేమీ లేదు. వారి వల్లనేకదా ఈనాడు తెలంగాణకు చెందినవారు పాలకులై రాష్ట్రాన్ని ఏలుతున్నారు! ఉద్యమకారులపై ప్రభుత్వాలకు కృతజ్ఞతా భావన ఎందుకు లేదు? ఉద్యమ కాలంలో చాలామంది తమ విలువైన సమయం, యవ్వనం తెలంగాణ సాధనకే అంకితం చేశారు. మరి తెలంగాణ పాలకులే కదా ఇప్పుడు వారి త్యాగాలను గుర్తించి ఆదుకోవాల్సింది?! మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు.. ప్రభుత్వం తమకు గతంలో ఇచ్చిన హామీల తాలూకు ప్రకటన చేస్తుందని ఉద్యమకారులంతా ఎదురు చూశారు. కానీ వారికి నిరాశే మిగిలింది. 1969 నాటి తొలిదశ ఉద్యమకారులెందరో చనిపోయారు. ప్రస్తుత ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందనే ఆశతో మలిదశ ఉద్యమకారులు బతుకుతున్నారు. కానీ ఈ ఎదురుచూపుల్లోనే ఎందరో ఉద్యమకారుల జీవితాలు రోజురోజుకూ చితికిపోతున్నాయి. ఊరూరా ఒక కాలనీ.. అందులో ఇందిరమ్మ పేరు మీదనో, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ పేరు మీదనో, ఏదో విధంగా పాలకులకు విశ్వసనీయత దక్కేలా ఉద్యమకారులకు గృహాలు నిర్మించి ఇవ్వొచ్చు కదా! నాణ్యమైన వైద్యం నేడు చాలా పిరం అయిపోయింది. హెల్త్ ఇన్సూరెన్సు, బతుకుదెరువుకు ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యమకారులను ఆదుకోవాల్సిన అవసరం పాలకులపై ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం కనీసం ప్రాథమికంగా ఒక ఐడెంటిటీ కార్డ్ లేదా సర్టిఫికెట్ ఇచ్చి గౌరవించినా, వారి పోరాటానికి కొంత గుర్తింపు, విలువ ఇచ్చినవారవుతారు. ఉద్యమకారులను ఆదుకోవడమంటే.. ఓ పదిమందికి తలో కోటి రూపాయలు, ప్లాట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. గత ప్రభుత్వం తమ పార్టీకి అనుబంధంగా ఉన్న కొంతమందిని మాత్రమే పట్టించుకున్నది.

అసలైన ఉద్యమ సమాజాన్ని పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని మారుస్తామంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక రెండో ఏడాది ఆవిర్భావదినోత్సవ వేడుకల్లోనూ ఉద్యమకారులకు అనుకూల ప్రకటనేమీ రాకపోవడం విచారకరం. ఐతే, ఉద్యమకారులు ఇప్పుడు ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు వదులుకుని నిరాశాజీవుల్లా మిగిలిపోతారో లేక తెలంగాణ ఉద్యమంలో చూపిన పోరాట పటిమను ప్రదర్శిస్తారో, లేదా ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకొని తమ హక్కులను సాధించుకుంటారో! ఆ లోపు ప్రభుత్వమే గ్రహించి, వారికిచ్చిన హామీలను నెరవేరిస్తే మరో ఉద్యమం అవసరం ఉండదు.

సయ్యద్ రఫీ (చిత్ర దర్శకుడు)

ఇవి కూడా చదవండి

ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్

పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 03:44 AM