Poem for Dad: రియల్ హీరో నాన్న
ABN, Publish Date - Jun 15 , 2025 | 03:36 AM
అంతులేని ప్రేమతో అంతంలేని ఆయుష్షు నీకివ్వాలని అనుక్షణం తాపత్రయపడుతూఅద్భుతమైన జీవితాన్ని నీకు పరిచయం చెయ్యాలని...
అంతులేని ప్రేమతో
అంతంలేని ఆయుష్షు నీకివ్వాలని
అనుక్షణం తాపత్రయపడుతూ
అద్భుతమైన జీవితాన్ని నీకు పరిచయం చెయ్యాలని
అత్యాశతో పగలు, రాత్రి
అలసట ఎరుగని శ్రామికుడు నాన్న
అంతులేని ప్రేమను పంచి, అందలం ఎక్కించి,
అట్టడుగులో తానుండి నీ నవ్వును చూసి మురిసే పిచ్చోడు నాన్న
అపురూపమనే పదానికి
అందం అనే అబద్ధానికి
అర్థ నిస్వార్థమైన తన బిడ్డలని
అరమరికలు లేని నీ స్వభావాన్ని
నీ విజయోత్సవంగా ఉత్సహించే ప్రేమపిపాసి నాన్న
బరువు అనిపించినా నీ బలం తానై
బలహీనతలు వెంటాడుతున్నా
బాధ్యతను విడిచిపెట్టక
భక్తికి శక్తిని తోడుచేసుకొని
తన జీవితమంతా రంగరించి
బిడ్డలకు నేనున్నాననే గుండె నిబ్బరం నాన్న
అనునిత్యం కర్పూరంలా తాను కరిగిపోతూ
నవ్వులు వెదజల్లే విశ్వాసం నాన్న
ప్రతి కూతురుకి (కొడుకుకి) రియల్ హీరో నాన్న
ఈ రోజున ఎదిగిన ప్రతి కొడుక్కి జీరో నాన్న అత్యంత విలువైన సంపద నాన్న
– వాసి జ్యోత్స్న
(నేడు ఫాదర్స్ డే)
Updated Date - Jun 15 , 2025 | 03:41 AM