ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Free Cervical Cancer Vaccines: ఉచితంగా సర్వైకల్‌ కేన్సర్‌ టీకాలు వేయండి

ABN, Publish Date - Aug 13 , 2025 | 04:40 AM

సర్వైకల్‌ కేన్సర్‌ గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ అన్నది ఇప్పుడు దేశంలో ఆడవాళ్లకు ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా పరిణమించింది.

సర్వైకల్‌ కేన్సర్‌ (గర్భాశయ ముఖద్వార కేన్సర్‌) అన్నది ఇప్పుడు దేశంలో ఆడవాళ్లకు ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా పరిణమించింది. ఈ కేన్సర్‌ సోకిన వాళ్లలో మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ స్త్రీలు రోగం బాగా ముదిరిన తర్వాత మాత్రమే ఆసుపత్రులకు వెడుతున్నారు. ప్రతి లక్ష మంది మహిళల్లో 13 మందికి పైగా గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో దాదాపు సగం మందికి పైగా మరణిస్తున్నారు. ఇది ఆందోళనకరమైన పరిస్థితే. మగవాళ్లకు కూడా ఇది సోకుతుంది కానీ అత్యధికంగా ఆడవాళ్లే దీనికి గురవుతారు. ఈ సర్వైకల్‌ కేన్సర్‌ నుంచి కాపాడే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిలోమ వైరస్‌) వ్యాక్సిన్‌ను తొమ్మిదేళ్ల బాలబాలికల నుంచి 45 ఏళ్ల స్త్రీల దాకా వేసుకోవచ్చు. కానీ మన దేశంలో ఈ వ్యాక్సిన్‌ ఉందనే విషయమే చాలా మంది స్త్రీలకు తెలియదు. దేశంలో 14 ఏళ్ల లోపు బాలలు 30 శాతం ఉన్నారు. వీరిని సర్వైకల్‌ కేన్సర్‌ బారిన పడకుండా కాపాడుకోవడం దేశ భవిష్యత్తుకు అవసరం. నగర, పట్టణ ప్రాంతాల్లోని చదువుకున్నవారు తప్ప హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను వేసుకోవడం లేదు. ఇది ఆందోళన కలిగించే అంశం. రూ.14 వందలు ఖర్చుపెట్టి ఈ టీకాను పేద కుటుంబాలు వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకోవడం మేలు. ప్రభుత్వం వ్యాక్సిన్‌ తయారీదారులతో ఒప్పందం చేసుకుంటే సగం ధరకన్నా తక్కువకే వ్యాక్సిన్‌ లభించే అవకాశం ఉంది. బాలలకు నిర్బంధంగా, ఉచితంగా ఈ వ్యాక్సిన్‌ వేసేలా ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రభుత్వానికి ఇది భారం అనుకుంటే, కార్పొరేట్‌ సంస్థల భాగస్వామ్యంతో ఈ పనిని చేపట్టవచ్చు. తమిళనాడు ప్రభుత్వంతోనూ, కేన్సర్‌ వైద్య నిపుణురాలు డాక్టర్‌ శాంతగారితోనూ కలిసి తను కొన్ని ప్రాంతాల్లో బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించానని సామాజిక సేవకురాలు, ఎంపీ సుధామూర్తి పార్లమెంటులోనే తెలిపారు. వీరిని మార్గదర్శకులుగా తీసుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఒక బ్రహత్‌ కార్యక్రమంలా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను చేపట్టాలని తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

– డాక్టర్‌ వసుంధర చీపురుపల్లి ఎండీ గైనిక్‌,

లాపరో అండ్‌ రొబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ కేజే రావు,

సామాజిక కార్యకర్త

Updated Date - Aug 13 , 2025 | 04:40 AM