ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ద్రవిడవాదానికి అనుగుణంగానే హిందీపై విషం!

ABN, Publish Date - Mar 18 , 2025 | 03:20 AM

‘హిందీ ఆధిపత్యం దేశ భవితవ్యానికి చేటు’ అంటూ మార్చి 4వ తేదీన వీర్ సంఘ్వి రాసిన వ్యాసం అసంబద్ధంగా ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ హిందీ భాషపై విషం కక్కుతూ...

‘హిందీ ఆధిపత్యం దేశ భవితవ్యానికి చేటు’ అంటూ మార్చి 4వ తేదీన వీర్ సంఘ్వి రాసిన వ్యాసం అసంబద్ధంగా ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ హిందీ భాషపై విషం కక్కుతూ– హిందీ భాష భారతదేశంలోని 19 స్థానిక భాషలను మింగేసిందనీ, తమిళనాడులో హిందీ భాష పెత్తనాన్ని అడ్డుకుంటామనీ, అందుకు భారతదేశంలోని ప్రజలందరూ సహకరించాలనీ సామాజిక మధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ గురించి వీర్‌ సంఘ్వి అతిశయోక్తులతో స్పందించారు.

దేశీయ భాష అయిన హిందీని వ్యతిరేకించడం ద్రవిడ రాజకీయాల్లో ఒక భాగం. రాజకీయాలపై తమ పార్టీలకు పట్టు తప్పుతుందనే అనుమానం వచ్చిన వెంటనే హిందీ భాష పెత్తనం, ఉత్తరాది ప్రభావం, సనాతన భారతీయ సంస్కృతి మౌఢ్యం అంటూ కట్టుకథలతో తమిళ ప్రజలలో భాషా ఉన్మాదాన్ని రెచ్చగొడుతుంటారు. హిందీ భాషపై ద్వేషం ఆ రాష్ట్రంలో 1937 నుండి జరుగుతున్న తంతే! 1965లో హిందీ భాషపై వ్యతిరేక ఉద్యమం హింసాత్మకంగా మారటంతో, కేంద్ర ప్రభుత్వం పారా మిలిటరీ దళాలను దింపి ఉద్యమాన్ని అణచివేసే ప్రక్రియలో, పెద్ద సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఈ విషయాన్ని దాచిపెట్టడం ఎందుకు? ఉద్యమాన్ని లేవదీసిన రామస్వామి పెరియార్, ఆయన శిష్యులైన కరుణానిధి, అన్నా దొరై తమిళ రాజకీయాలలో తిరుగులేని నాయకులైనారు. బలిదానం సామాన్య ప్రజలది.


బ్రిటిష్ పాలకులు భారతదేశంలో తమ పరిపాలనను స్థిరీకరించుకోవడం కోసం భారతీయులను కులాల వారీగా, భాషల వారీగా, ప్రాంతాల వారీగా విభజించడంలో భాగంగా ఉత్తర భారతీయులు ఆర్య జాతికి చెందిన వారని, దక్షిణ భారతదేశం లోని ప్రజలు, ముఖ్యంగా తమిళులు, ద్రావిడ సంస్కృతికి చెందిన వారనీ, వీరు భారతీయ సంస్కృతిలో భాగం కాదనీ, హిందీ ఆర్యుల భాష ఐన సంస్కృతం నుండి పుట్టిందనీ ఒక కట్టు కథల సిద్ధాంతాన్ని అల్లి, దానిని భారతీయుల మనసుల్లోకి బలంగా ఎక్కించారు. ఆర్య ద్రావిడ సిద్ధాంత భావజాలాన్ని తమిళనాడులోని జస్టిస్ పార్టీ బాగా ప్రచారం చేసింది. కాంగ్రెస్ సంస్థ నడిపే స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఈ పార్టీ వ్యతిరేకించిన విషయం నేటి యువకుల్లో చాలామందికి తెలియదు. జస్టిస్ పార్టీ మరో రూపమే ద్రవిడ మున్నేట్ర కగజం. తమిళుల విఘటన వాదాన్ని తమిళనాడులోని జాతీయవాద నాయకులు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ విషయం వ్యాసకర్తకు తెలియదేమో!

లోక్‌సభ స్థానాల పునర్విభజన విషయంలో తమిళనాడుకు అన్యాయం జరిగిపోతుందన్న స్టాలిన్, మోదీ ప్రభుత్వ వ్యతిరేకుల వాదనలలో పసలేదు. ప్రస్తుతం తమిళనాడుకి 39 లోక్‌సభ సీట్లు ఉంటే ఉత్తరప్రదేశ్‌కు 80సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల కేటాయింపు బీజేపీ ప్రభుత్వం చేసింది కాదు. ఇక ఉత్తరాది వారు జనాభాను కంట్రోల్ చేయలేదనీ, దక్షిణాది రాష్ట్రాలు జనాభాను కంట్రోల్ చేసినందుకు శిక్షకు గురి అవుతున్నాయనీ చేసే వాదనలు అర్థరహితం. ఈ వాదనలన్నీ బీజేపీ అధికార ప్రాబల్యాన్ని దెప్పిపొడవడానికే!


ఈ దేశంలోని మెజార్టీ ప్రజలు మాట్లాడే హిందీ భాషను ఒక కొత్త భాష అని పేర్కొనడం, హిందీని సంస్కృతమయం చేశారని చెప్పడంలో వ్యాసకర్త గందరగోళానికి గురయ్యాడు. ఈయన ఆర్య ద్రావిడ వాదాన్ని బాగా తలకెక్కించుకున్నట్లు స్పష్టమైంది. హిందీ భాషను దక్షిణాది వారిపై రుద్దడానికి ప్రయత్నిస్తున్న వారి గురించి వాపోతూనే, కొంతమంది ఉత్తరాది వారి సంకుచిత భావజాలాల వల్ల హిందీ భాష దేశ ప్రజల దగ్గరికి చేరలేదని వాదన చేయడంలో ఔచిత్యం ఏమిటి? హిందీ భాషకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించడానికి స్వాతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ ప్రస్తావన ఎందుకు?

ఈ దేశ ప్రజలను ప్రాంతాల వారీగా, మతాల వారీగా, భాషల వారీగా, వర్గాల వారీగా విభజించి అధికారంలో కొనసాగాలనే దురాలోచన ఎక్కువ ప్రాంతీయ పార్టీల నాయకులకు ఉంటుంది. దేశ ప్రజలను సమైక్యంగా ఉంచాలన్న విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆలోచనలలో పెద్ద తేడా లేదు. 1937 నుండి 1967 వరకు ద్రావిడ వాద రాజకీయ నాయకులు కాంగ్రెస్‌ను ఆడి పోసుకుని, ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి ఉనికి లేకుండా చేశారు. 2024 ఎన్నికలలో తమిళనాడులో బీజేపీ 16శాతం ఓట్లను సాధించింది. ఈ విషయం తమిళ భాషా వాద రాజకీయ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా భాషోద్యమాన్ని లేవదీస్తున్నారు.


1986లో దేశమంతా నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తే -తమిళనాడులో ద్రావిడ వాద రాజకీయ నాయకులు వాటి ఏర్పాటును అడ్డుకున్నారు. దేశంలో ఈ విద్యాలయాలు లేని రాష్ట్రం ఒక్క తమిళనాడే. భాష పేరుతో ప్రజలను రాజకీయాల చుట్టూ తిప్పుకోవడం తమిళ నాయకులకు అలవాటే! దేశ సమైక్యత సమగ్రతల విషయంలో ఏకాభిప్రాయంతో ఉండే ప్రజలు తమిళనాడులో సైతం ఉన్నారు. ఈ ప్రజా సమూహమే ఈ ద్రవిడవాద రాజకీయ నాయకుల దుర్నీతికి అడ్డుకట్ట వేస్తుంది.

ఉల్లి బాలరంగయ్య

ఇవి కూడా చదవండి...

KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన పాపం ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్

Pawan Kalyan on NREGS: ఉపాధి హామీ పథకంలో అవకతవకలను బయటపెట్టిన పవన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 18 , 2025 | 03:20 AM