మతమౌఢ్యంతో మారణహోమం
ABN, Publish Date - May 29 , 2025 | 01:18 AM
ఇటీవల చోటుచేసుకున్న పహల్గాం ఘటన హిందూ సమాజానికి ఓ హెచ్చరిక. హిందువులనే లక్ష్యంగా చేసుకొని కశ్మీర్‌లో జిహాదీ మూకలు ఉగ్రదాడికి తెగబడ్డాయి. కల్మా చదవకపోతే చంపేస్తారా?!...
ఇటీవల చోటుచేసుకున్న పహల్గాం ఘటన హిందూ సమాజానికి ఓ హెచ్చరిక. హిందువులనే లక్ష్యంగా చేసుకొని కశ్మీర్‌లో జిహాదీ మూకలు ఉగ్రదాడికి తెగబడ్డాయి. కల్మా చదవకపోతే చంపేస్తారా?!
ఇప్పటికే బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత, అత్యాచారాలు, ఆస్తుల లూటీ, ఇళ్ల ధ్వంసం, వారిని చిత్రహింసలకు గురిచేయడం అనే రాక్షసక్రీడ కొనసాగుతూనే ఉంది. అంతలోనే హిందూదేశంగా భావించే భారత్‌లో పహల్గాం వంటి దౌర్జన్య ఉగ్రరాక్షసి కోరలు చాచి హిందువులపై మారణకాండ జరపడం అత్యంత అమానుషం. మానవ హక్కుల సంఘాలు, రాజ్యాంగ పరిరక్షకులు, సెక్యులరిస్టులు, మేధావులు, జర్నలిస్టులు ఈ చర్యపై ఏ విధంగా స్పందించారో హిందూ సమాజం తెలుసుకోవాలి. మైనారిటీల హక్కుల కోసం గొంతెత్తే అవార్డు వాపసి బృందాలు పహల్గాం విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నాయో అర్థం చేసుకోవాలి.
‘‘ఐక్యంగా ఉంటేనే బలంగా ఉంటాం’’ అనే నినాదం ద్వారా హిందూ సమాజం సంఘటితం కావాలి. ఢిల్లీలో ఓ వ్యక్తి శ్రీరాముడి ఫొటోను డీపీగా పెట్టుకున్నందుకు ఇంట్లో జొరబడి అతణ్ణి హత్య చేశారు! రాజస్థాన్‌లో కన్నయ్యలాల్ అనే టైలర్ తలనరికారు. హిందూ పేరు ఉందని కశ్మీర్‌లో ఉపాధ్యాయులను హత్య చేశారు. మరోవైపు లవ్ జిహాద్ కేసులు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మోదీ, యోగి అవసరం లేకుండా మనమే ధర్మరక్షణ, ప్రాణరక్షణ కోసం సంసిద్ధంగా ఉండాలి.
పగుడాకుల బాలస్వామి
విశ్వహిందూ పరిషత్
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News
Updated Date - May 30 , 2025 | 02:55 PM